త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | వ్య‌భిచారం నేరం కాదు.. సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను వేధించొద్దు : సుప్రీంకోర్టు

Supreme Court | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వచ్ఛందంగా వేశ్యగా మారడం (Voluntary Sex Work) నేరం కాదని తేల్చి చెప్పింది.

D

National | Published On May 29, 2026, 4.28 pm IST

Supreme Court | వ్య‌భిచారం నేరం కాదు.. సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను వేధించొద్దు : సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వచ్ఛందంగా వేశ్యగా మారడం (Voluntary Sex Work) నేరం కాదని తేల్చి చెప్పింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారికి, మానవ అక్రమ రవాణా ద్వారా (human trafficking) బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడిన బాధితులకు మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న తేడాను గుర్తించాలని సూచించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లకు చట్టపరంగా సమాన రక్షణ ఉండాలని పేర్కొంది. 18 సంవత్సరాలు నిండిన లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు.. తమకు నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని పేర్కొంది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలో కొనసాగుతున్న మేజర్లపై పోలీసులు దాడులు నిర్వహించడం, కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని స్ప‌ష్టం చేసింది. కేవలం ఈ వృత్తిలో ఉన్నారనే కారణంతో వారిని వేధించడం స‌రికాద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది.

అంతేకాకుండా రైడ్స్ చేసినప్పుడు వారిని బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్లకు తరలించవద్దని ఆదేశించింది. సెక్స్‌ వర్కర్ల ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు ఇవ్వొద్దని కూడా కోర్టు ఆదేశించింది. వారి గుర్తింపును బహిర్గతం చేయడం వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించ‌డ‌మేన‌ని అభిప్రాయ‌ప‌డింది. మీడియా సంస్థలు కూడా బాధితుల వివరాలు, చిత్రాలు ప్రసారం చేయరాదని సూచించింది.

నివాస ధ్రువీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ సెక్స్ వర్కర్లందరికీ తక్షణమే ఆధార్ కార్డులు జారీ చేయాలని UIDAIని సుప్రీంకోర్టు ఆదేశించింది. గుర్తింపు పత్రాల లేని కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి దూరం కాకూడదని పేర్కొంది. అదేస‌మ‌యంలో మాన‌వ అక్ర‌మ ర‌వాణాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా మ‌హిళ‌లు, చిన్నారుల‌ను బ‌ల‌వంతంగా వ్య‌భిచార వృత్తిలోకి నెట్టే మాఫియాల‌ను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీం కోర్టు అధికారుల‌ను ఆదేశించింది.

Also Read..

కాక్రోచ్ పార్టీకి షాక్‌.. ఎక్స్ ఖాతా పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన హైకోర్టు

క‌ల్తీ మ‌ద్యం తాగి 15 మంది మృతి.. ప‌లువురి ప‌రిస్థితి విష‌మం

స్ట్రెస్ టెస్ట్ నార్మ‌ల్ వ‌స్తే లైట్ తీసుకోవ‌ద్దు.. గుండె పోటు ప్ర‌మాదం పూర్తిగా తొల‌గిపోదు..

Advertisement
Advertisement