HCA | హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్..!
HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో చోటుచేసుకున్న ఆర్థిక అక్రమాలు, నిధుల దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది.
హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్..!
HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో చోటుచేసుకున్న ఆర్థిక అక్రమాలు, నిధుల దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్‌రావు, సీజే శ్రీనివాస్‌రావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కాంటేతో పాటు పలువురు బోర్డు సభ్యులపై నిధుల దుర్వినియోగం, అక్రమ చెల్లింపులు, అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులు రావడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి హెచ్‌సీఏకు అందిన నిధులను భారీ స్థాయిలో అక్రమంగా వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో, హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులకు సంబంధించిన అన్ని అంశాలను సిట్ అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగం, సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. దర్యాప్తు దాదాపు పూర్తయిందని, త్వరలోనే ఈ కేసులకు సంబంధించిన చార్జ్‌షీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయనున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. హెచ్‌సీఏలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Congress leader attacked | పిల్లలు క్రికెట్ ఆడారని తల్లిదండ్రులపై దాడి.. ఆపై పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కించుకున్న కాంగ్రెస్ నేత
జూన్ 1, 2026

South Central Railway | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 132 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!
జూన్ 1, 2026

Supreme Court | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుబ్రమణి మోహన.. నేరుగా అపెక్స్ కోర్టుకు వెళ్లిన రెండో మహిళగా ఘనత..!
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Congress leader attacked | పిల్లలు క్రికెట్ ఆడారని తల్లిదండ్రులపై దాడి.. ఆపై పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కించుకున్న కాంగ్రెస్ నేత
- ●itel Aqua | రూ.1,799కే వాటర్‌ప్రూఫ్ ఫీచర్ ఫోన్.. ఐటెల్ ఆక్వా ఎంట్రీ..
- ●South Central Railway | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 132 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!
- ●Telugu Serial | సీరియల్ లవర్స్‌కు షాక్ ... క్లైమాక్స్ చేరుకున్న లక్ష్మీ రావే మా ఇంటికి - ఐదు నెలల్లోనే శుభంకార్డు
- ●Lawn Mowing Jobs in USA | సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే వాళ్లకే ఎక్కువ జీతమా? నెలకు రూ.10 లక్షలు.. అమెరికాలో 'గడ్డి కత్తిరింపు' సీక్రెట్ ఇదే!
- ●Supreme Court | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుబ్రమణి మోహన.. నేరుగా అపెక్స్ కోర్టుకు వెళ్లిన రెండో మహిళగా ఘనత..!

Congress leader attacked | పిల్లలు క్రికెట్ ఆడారని తల్లిదండ్రులపై దాడి.. ఆపై పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కించుకున్న కాంగ్రెస్ నేత

itel Aqua | రూ.1,799కే వాటర్‌ప్రూఫ్ ఫీచర్ ఫోన్.. ఐటెల్ ఆక్వా ఎంట్రీ..

South Central Railway | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 132 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!

Telugu Serial | సీరియల్ లవర్స్‌కు షాక్ ... క్లైమాక్స్ చేరుకున్న లక్ష్మీ రావే మా ఇంటికి - ఐదు నెలల్లోనే శుభంకార్డు



