త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu Serial | సీరియల్ లవర్స్‌కు షాక్ … క్లైమాక్స్ చేరుకున్న లక్ష్మీ రావే మా ఇంటికి – ఐదు నెల‌ల్లోనే శుభంకార్డు

జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న ల‌క్ష్మీరావే మా ఇంటికి సీరియ‌ల్ క్లైమాక్స్‌కు చేరుకుంద‌ట‌. ఈ వీక్‌లోనే ఈ సీరియ‌ల్‌కు శుభం కార్డు ప‌డ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో మొద‌లైన ఈ సీరియ‌ల్ ఐదు నెల‌లు కాక‌ముందే ముగింపుకు చేరుకోవ‌డం గ‌మ‌నార్హం.

N

Entertainment | Published On Jun 1, 2026, 5.49 pm IST

Telugu Serial | సీరియల్ లవర్స్‌కు షాక్ … క్లైమాక్స్ చేరుకున్న లక్ష్మీ రావే మా ఇంటికి – ఐదు నెల‌ల్లోనే శుభంకార్డు
Advertisement

Telugu Serial |  జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న ల‌క్ష్మీ రావే మా ఇంటికి సీరియ‌ల్ క్లైమాక్స్‌కు చేరుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సీరియ‌ల్‌కు మేక‌ర్స్ ఎండ్ కార్డ్ వేయ‌బోతున్నార‌ని అంటున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ల‌క్ష్మీరావే మా ఇంటికి సీరియ‌ల్ లాంఛ్ అయ్యింది. ఐదు నెల‌ల్లోపే ఈ సీరియ‌ల్ ముగింపుకు చేరుకోవ‌డం సీరియ‌ల్ ఫ్యాన్స్‌ను షాకింగ్‌కు గురిచేస్తోంది. ఇప్ప‌టికే క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్త‌య్యింద‌ట‌. ఈ వారంలోనే ల‌క్ష్మీ రావే మా ఇంటికి సీరియ‌ల్‌కు మేక‌ర్స్ శుభం కార్డు వేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

త‌మిళ న‌టుడు...

ఈ తెలుగు సీరియ‌ల్‌లో ద‌ర్శిని గౌడ‌, య‌శ్వంత్ గౌడ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. తొలుత హీరోగా త‌మిళ న‌టుడు హ‌ర్ష్ నాగ్‌పాల్‌ను తీసుకున్నారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల అత‌డు ఈ సీరియ‌ల్ నుంచి త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో య‌శ్వంత్ గౌడ ఇటీవ‌లే ల‌క్ష్మీ రావే మా ఇంటికి లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అన్న‌పూర్ణ స్టూడియోస్‌...

అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సీరియ‌ల్ ఇటీవ‌లే వంద ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 115 ఎపిసోడ్స్ పూర్త‌య్యాయి. 120వ ఎపిసోడ్‌తో ల‌క్ష్మీ రావే మా ఇంటికి ముగియ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఫ్యాన్స్ డిస‌పాయింట్‌...

సీరియ‌ల్‌ను త్వ‌ర‌గా ముగిస్తుండ‌టంతో ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతున్నారు. య‌శ్ ఎంట్రీతో ఆస‌క్తిక‌రంగా మారింద‌ని, అర్ధాంత‌రంగా ఎండ్ చేయ‌కుండా ఇంకొన్నాళ్లు కంటిన్యూ చేస్తే బాగుండేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ సీరియ‌ల్ జీ తెలుగులో రాత్రి ప‌దిన్న‌ర నుంచి ప‌ద‌కొండు గంట‌ల వ‌ర‌కు టెలికాస్ట్ అవుతోంది.

 

Advertisement
Advertisement