త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

itel Aqua | రూ.1,799కే వాటర్‌ప్రూఫ్ ఫీచర్ ఫోన్.. ఐటెల్ ఆక్వా ఎంట్రీ..

itel Aqua | భారత మార్కెట్లో ఐటెల్ తన కొత్త ఇన్నో సిరీస్ ని అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఐటెల్ ఆక్వా దేశంలోనే ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కలిగిన ఏకైక ఫీచర్ ఫోన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టింది.

S

Technology | Published On Jun 1, 2026, 6.00 pm IST

itel Aqua | రూ.1,799కే వాటర్‌ప్రూఫ్ ఫీచర్ ఫోన్.. ఐటెల్ ఆక్వా ఎంట్రీ..
Advertisement

itel Aqua | భారత మార్కెట్లో ఐటెల్ తన కొత్త ఇన్నో సిరీస్ ని అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఐటెల్ ఆక్వా దేశంలోనే ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కలిగిన ఏకైక ఫీచర్ ఫోన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం వినియోగదారులు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సాధారణ సమస్యలకు పరిష్కారం చూపేలా మన్నిక, వినూత్న ఫీచర్ల సమ్మేళనంతో ఇన్నో సిరీస్‌ను రూపొందించారు. ఐటెల్ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఫోన్ ను మార్చుకోవడానికి ప్రధాన కారణాల్లో నీటి వల్ల కలిగే నష్టం ఒకటిగా తేలింది. మొత్తం రీప్లేస్‌మెంట్‌లలో సుమారు 42 శాతం కేసులు వాటర్ డ్యామేజ్ కారణంగానే నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఐటెల్ ఆక్వాకు ఐపీ67 సర్టిఫికేషన్ అందించారు. దీంతో ఈ ఫోన్ 30 నిమిషాల వరకు నీటిలో మునిగినా పనిచేస్తుంది. అలాగే బురద, తడి వాతావరణం, దుమ్ము వంటి పరిస్థితుల్లో కూడా రక్షణ కల్పిస్తుంది.

టైప్ సి చార్జింగ్‌, వైర్ లెస్ ఎఫ్ఎం రేడియో..

ఐటెల్ ఆక్వాలో భారత ఫీచర్ ఫోన్ మార్కెట్లో తొలిసారిగా ఏఐ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఈఎన్‌సీ) టెక్నాలజీని అందించారు. మార్కెట్లు, ఫ్యాక్టరీలు, నిర్మాణ ప్రదేశాలు, ట్రాఫిక్ వంటి అధిక శబ్దం ఉన్న ప్రాంతాల్లో కూడా కాల్ సమయంలో పరిసర శబ్దాలను తగ్గించి స్పష్టమైన వాయిస్ కమ్యూనికేషన్‌ను అందించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఐటెల్ ఆక్వాలో 2.4 ఇంచుల డిస్‌ప్లేను అందించారు. దీనికి శక్తినిచ్చే 1200 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ ను కూడా అందించారు. అలాగే కింగ్ వాయిస్ అనే ద్విభాషా వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ ఇందులో ఉంది. ఇది హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మెను, సందేశాలు, కాల్ వివరాలను వాయిస్ రూపంలో వినిపిస్తుంది. అలాగే 10 ప్రాంతీయ భాషలకు మద్దతు కూడా అందుబాటులో ఉంది. వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో, ఎఫ్‌ఎం రికార్డింగ్, ఆటో కాల్ రికార్డింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 32 జీబీ వరకు మెమరీ విస్తరణకు స‌పోర్ట్‌ ఉండగా, ఫోన్‌బుక్‌లో 1వేయి కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు.

ధ‌ర వివ‌రాలు..

ఐటెల్ ఆక్వా ఫీచ‌ర్ ఫోన్‌లో వీజీఏ కెమెరాను ఇచ్చారు. ఇందులో ఆటో కాల్ రికార్డింగ్ ఫీచ‌ర్ ఉండ‌గా దీని స‌హాయంతో 60 కాల్ లాగ్స్ స్టోర్ అవుతాయి. ఇక ఈ ఫోన్ బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో రూ.1,799 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సందర్భంగా ఐటెల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ టెక్నాలజీని సమకాలీనంగా ఉంచేది ఇన్నోవేషన్ అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత వినూత్న టెక్ బ్రాండ్‌గా ఐటెల్‌ను తీర్చిదిద్దే దిశగా ఇన్నో సిరీస్ ప్రారంభం కీలక అడుగు అని, తీరప్రాంతాల తేమతో కూడిన వాతావరణం నుంచి ఎడారి ప్రాంతాల పొడి, దుమ్ముతో కూడిన పరిస్థితుల వరకు దేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐటెల్ ఆక్వాను రూపొందించామ‌ని తెలిపారు. కోట్లాది మంది భారతీయులు ఎదుర్కొనే సాధారణ సమస్యకు పరిష్కారం చూపడం ద్వారా ఫీచర్ ఫోన్ విభాగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలన్నదే త‌మ‌ లక్ష్యమ‌ని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement