త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lawn Mowing Jobs in USA | సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే వాళ్లకే ఎక్కువ జీతమా? నెలకు రూ.10 లక్షలు.. అమెరికాలో ‘గడ్డి కత్తిరింపు’ సీక్రెట్ ఇదే!

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే గడ్డి కత్తిరించే వాళ్లే ఎక్కువ సంపాదిస్తున్నారా? నెలకు రూ.10 లక్షల ఆదాయం ఎలా వస్తుందో ఈ వైరల్ వీడియోలో తెలుసుకోండి.

J

Viral news | Published On Jun 1, 2026, 5.49 pm IST

Lawn Mowing Jobs in USA | సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే వాళ్లకే ఎక్కువ జీతమా? నెలకు రూ.10 లక్షలు.. అమెరికాలో ‘గడ్డి కత్తిరింపు’ సీక్రెట్ ఇదే!
Advertisement

Lawn Mowing Jobs in USA | త్రినేత్ర.న్యూస్ : అమెరికా (USA) వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడితే కోట్లలో సంపాదించవచ్చని చాలామంది కలలు కంటుంటారు. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఎన్ఆర్ఐ (NRI) మహిళ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల (Software employees) కంటే.. ఇండ్ల ముందు గడ్డి కత్తిరించే (Lawn cleaning) వాళ్లే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఆ వీడియోలో వివరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం!

టెకీలను మించిపోతున్న 'బ్లూ కాలర్' జాబ్స్

సాధారణంగా యూఎస్ (US) వెళ్లిన వాళ్లంతా పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో (IT Companies) ఉద్యోగాల గురించి, ప్యాకేజీల గురించే మాట్లాడుకుంటారు. కానీ, అక్కడ కొన్ని బ్లూ కాలర్ జాబ్స్ (Blue collar jobs) కు ఉన్న డిమాండ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎన్ఆర్ఐ మహిళ షేర్ చేసిన వీడియో ప్రకారం, అక్కడ ల్యాండ్‌స్కేపింగ్ (Landscaping) పనులు చేసేవారికి కళ్లు చెదిరే ఆదాయం వస్తోంది.

గంటకు 100 డాలర్లు.. నెలకు రూ.10 లక్షలు

వేసవి కాలంలో అమెరికాలో ఇండ్ల ముందు గడ్డి చాలా వేగంగా పెరుగుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయకపోతే మున్సిపాలిటీ వాళ్లు ఫైన్లు వేస్తారు. అందుకే గడ్డిని కత్తిరించి, క్లీన్ చేసేందుకు గంటకు దాదాపు 100 డాలర్ల (సుమారు రూ.8,300) వరకు ఛార్జ్ చేస్తారు. ఎవరైనా సొంతంగా ఎక్విప్‌మెంట్ పెట్టుకుని ఈ ల్యాండ్‌స్కేపింగ్ బిజినెస్ (Business) రన్ చేస్తే.. నెలకు ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఈజీగా ఆర్జిస్తున్నారట!

చలికాలంలో ఏం చేస్తారు?

పోనీ సొంతంగా కాకుండా, వేరే వాళ్ల దగ్గర ఎంప్లాయీగా (Employee) పని చేసినా సరే నెలకు కనీసం రూ.4 లక్షల వరకు జీతం లభిస్తుందని ఆ మహిళ వీడియోలో పేర్కొన్నారు. మరి వేసవి అయిపోతే వాళ్ల పరిస్థితి ఏంటి? అనే డౌట్ రావచ్చు.

అమెరికాలో చలికాలంలో (Winter) మంచు విపరీతంగా కురుస్తుంది కాబట్టి, ఆ సమయంలో వీరంతా 'స్నో క్లీనింగ్' (Snow cleaning) పనులకు షిఫ్ట్ అవుతారు. ఇళ్ల ముందు, రోడ్ల మీద పేరుకుపోయిన మంచును తొలగిస్తూ అప్పుడు కూడా భారీగానే సంపాదిస్తారు. అలా ఏడాది మొత్తం పని చేస్తూ టెకీల (Techies) కంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కష్టపడే తత్వం ఉంటే అమెరికాలో ఏ పని చేసినా లక్షలు సంపాదించవచ్చని ఈ వైరల్ వీడియో మరోసారి నిరూపించింది.

Advertisement
Advertisement