త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress leader attacked | పిల్ల‌లు క్రికెట్ ఆడార‌ని త‌ల్లిదండ్రుల‌పై దాడి.. ఆపై పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కించుకున్న కాంగ్రెస్ నేత

స‌మాజంలో రోజు రోజుకు పైత్యం మితిమీరుతుందంటే ఇదేనేమో. కాల‌నీలో పిల్లలు క్రికెట్ ఆడారని వారి తల్లిదండ్రులపై దాడి చేసి అరాచ‌కం సృష్టించాడో ప్ర‌భుద్దుడు. దంప‌తుల్ని పోలీస్ స్టేష‌న్‌కు ర‌ప్పించి వేధింపుల‌కు గురిచేశాడు. పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కించుకున్నాడు. ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిన ఈ అమాన‌వీయ‌ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

S

Hyderabad | Published On Jun 1, 2026, 6.12 pm IST

Congress leader attacked | పిల్ల‌లు క్రికెట్ ఆడార‌ని త‌ల్లిదండ్రుల‌పై దాడి.. ఆపై పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కించుకున్న కాంగ్రెస్ నేత
Advertisement
  • ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో అధికార‌ కాంగ్రెస్ నేత లుక‌స్‌ అరాచ‌కం
  • ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన అమాన‌వీయ ఘ‌ట‌న‌

Congress leader | త్రినేత్ర‌.న్యూస్: స‌మాజంలో రోజు రోజుకు పైత్యం మితిమీరుతుందంటే ఇదేనేమో. కాల‌నీలో పిల్లలు క్రికెట్ ఆడారని వారి తల్లిదండ్రులపై దాడి చేసి అరాచ‌కం సృష్టించాడో ప్ర‌భుద్దుడు. అంత‌టితో ఆగ‌కుండా బంగారం దొంగతనం చేశారని అర్ధ‌రాత్రి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి తప్పుడు ఫిర్యాదు చేశాడు. అప్ప‌టిక‌ప్పుడే దంప‌తుల్ని పోలీస్ స్టేష‌న్‌కు ర‌ప్పించి వేధింపుల‌కు గురిచేశాడు. కాళ్లు మొక్కితేనే కేసు వాప‌స్ తీసుకుంటాన‌ని బెదిరించ‌గా పోలీసుల సాక్షిగా బాధితులు కాళ్లు మొక్కారు. ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిన ఈ అమాన‌వీయ‌ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

బీహార్‌కు చెందిన లీలావతి, ఆమె భర్త ఉప్పల్ ఐడీఏ ప్రాంతంలోని లక్ష్మీనారాయణ కాలనీలో నివాసం ఉంటున్నారు. మే 25న సాయంత్రం వీరి కుమారులిద్ద‌రు మరికొంత మందితో కలిసి కాలనీలోని రోడ్డుపై క్రికెట్ ఆడారు. అదే కాలనీలో ఉండే మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నేత లుకస్.. నా ఇంటి ముందే క్రికెట్ ఆడుతారా అంటూ బూతులు తిడుతూ ఊగిపోయాడు. ప్రశ్నించిన లీలావతిని బూతులు తిడుతూ దాడికి తెగ‌బ‌డ్డాడు. లీలావతి దుస్తులు చినిగిపోవడంతో అడ్డుకోబోయిన ఆమె భర్తపై సైతం నెత్తురోడెలా దాడి చేశాడు.

దాడి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో తప్పును కప్పిపుచ్చుకోవడానికి సదరు కాంగ్రెస్ నేత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. లీలావతి కుటుంబం తన బంగారు గొలుసు దొంగతనం చేసిందని ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ దంపతులు ఆందోళనతో తమపై చోరీ కేసు పెట్టొద్దని ప్రాధేయపడగా.. తన కాళ్లు మొక్కి, తప్పు చేశామని ఒప్పుకుంటేనే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానని బెదిరింపుల‌కు దిగాడు. గత్యంతరం లేక పోలీసుల సాక్షిగానే బాధితులు కాళ్లు మొక్కాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండ‌గా తమపై జరిగిన దాడిని వివరించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు ప్రయత్నించగా పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించడం గ‌మ‌నార్హం. కాగా పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై న‌గ‌ర‌వాసులు మండిప‌డుతున్నారు. న్యాయం చేయాల్సిన వారే ఇలా నిర్ల‌క్ష్యం చేస్తే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. బాధితుల‌కు త‌క్ష‌ణ‌మే న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement