Hyderabad | పరారీలో ఉన్న నేపాలీలను అరెస్టు చేసేందుకు రంగంలోకి సిట్ బృందం..!
Hyderabad | నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా చోటుచేసుకున్న చోరీలు, హత్యలు తదితర కేసుల్లో పరారీలో ఉన్న నేపాల్ జాతీయులను గుర్తించి అరెస్టు చేయడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రంగంలోకి దించారు. ఈ నేపథ్యంలో గతంలో నమోదైన కేసుల వివరాలను సేకరించి సమగ్రంగా పరిశీలించే ప్రక్రియను సిట్ ప్రారంభించింది.
హైదరాబాద్ సీపీ సజ్జనార్
Hyderabad | నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా చోటుచేసుకున్న చోరీలు, హత్యలు తదితర కేసుల్లో పరారీలో ఉన్న నేపాల్ జాతీయులను గుర్తించి అరెస్టు చేయడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రంగంలోకి దించారు. ఈ నేపథ్యంలో గతంలో నమోదైన కేసుల వివరాలను సేకరించి సమగ్రంగా పరిశీలించే ప్రక్రియను సిట్ ప్రారంభించింది. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని చీఫ్‌గా నియమించిన ఈ సిట్‌లో మొత్తం 20 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ విభాగం, ఐటీ సెల్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను ఆమె ఇంటి పనిమనిషితో పాటు ఆమె సహచరులు దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే.
ఈ ఘటన అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. గత ఎనిమిదేళ్లలో నగరంలో నేపాల్ జాతీయుల ప్రమేయంతో నమోదైన కేసులపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటివరకు సుమారు 60 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో కేసును విడివిడిగా పరిశీలిస్తూ.. అందుబాటులో ఉన్న ఆధారాలు, సాక్ష్యాలు, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి పరారీలో ఉన్న నిందితులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ కేసుల్లో ఎక్కువ మంది నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొందరు ఇంకా పోలీసుల కళ్లుగప్పి పరారీలోనే ఉన్నారు. గత కేసుల అధ్యయనం పూర్తయిన తర్వాత పరారీలో ఉన్న వ్యక్తుల జాబితాను సిద్ధం చేసి, వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలు, ఇలాంటి నేరాల వెనుక ఉన్న వ్యవస్థీకృత నేర ముఠాలను గుర్తించడం కూడా సిట్‌కు అప్పగించిన కీలక బాధ్యతలుగా పోలీసులు వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
జూన్ 1, 2026

HCA | హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్..!
జూన్ 1, 2026

TG Weather | తెలంగాణ వాసులకు ఐఎండీ గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో నాలుగైదు రోజులు వర్షాలు..!
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!
- ●Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
- ●Supreme Court | సీబీటీ విధానం కుదరదు.. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ●HCA | హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్..!
- ●RCB Players Net Worth 2026 | ఐపీఎల్ 2026 ఛాంపియన్స్ 'RCB' ప్లేయర్ల ఆస్తుల చిట్టా: విరాట్ కోహ్లీ సంపాదన చూస్తే షాకే!
- ●HMWSSB | నగర ప్రజలకు శుభవార్త.. ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగింపు

Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!

Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!

Supreme Court | సీబీటీ విధానం కుదరదు.. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

HCA | హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్..!



