South Central Railway | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 132 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!
South Central Railway | ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో నడుస్తున్న వారపు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించింది. సెప్టెంబర్ వరకు మొత్తం 132 సర్వీసులను కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
South Central Railway | ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో నడుస్తున్న వారపు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించింది. సెప్టెంబర్ వరకు మొత్తం 132 సర్వీసులను కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్–నహర్లగన్, చర్లపల్లి–సంత్రగచ్చి, హైదరాబాద్ డెక్కన్–కొల్లం, సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్, జాల్నా–తిరుపతి మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నామని, రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
సికింద్రాబాద్–నహర్లగన్ ప్రత్యేక రైలు (07046) జూలై 3 నుంచి సెప్టెంబర్ 25 వరకు ప్రతి శుక్రవారం నడవనుండగా, తిరుగు ప్రయాణంలో రైలు (07047) జూలై 6 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉండనునంది. చర్లపల్లి–సంత్రగచ్చి (07221) రైలు జూలై 4 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి శనివారం, తిరుగు ప్రయాణంలో రైలు (07222) జూలై 5 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతి ఆదివారం రాకపోకలు సాగిస్తుంది. హైదరాబాద్ డెక్కన్–కొల్లం (07193) రైలు జూలై 4 నుంచి సెప్టెంబర్ 26 వరకు శనివారాల్లో, తిరుగు మార్గంలో రైలు (07194) జూలై 6 నుంచి సెప్టెంబర్ 28 వరకు సోమవారాల్లో నడుస్తుందని అధికారులు తెలిపారు.
ఇక సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్ (07425) ప్రత్యేక రైలు జూలై 5 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఆదివారాల్లో నడువనుండగా..తిరుగు ప్రయాణంలో రైలు (07426) జూలై 6 నుంచి సెప్టెంబర్ 28 వరకు సోమవారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే, జాల్నా–తిరుపతి (07814) రైలు జూలై 2 నుంచి సెప్టెంబర్ 24 వరకు ప్రతి గురువారం, తిరుగు ప్రయాణంలో రైలు (07815) జూలై 3 నుంచి సెప్టెంబర్ 25 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగిస్తుంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు అదనపు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు చెప్పింది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ICC Meeting | టెస్టులు, టీ20ల్లో కీలక మార్పులు.. ఐసీసీ బోర్డు మీటింగ్ గ్రీన్ సిగ్నల్..
జూన్ 1, 2026

Supreme Court | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుబ్రమణి మోహన.. నేరుగా అపెక్స్ కోర్టుకు వెళ్లిన రెండో మహిళగా ఘనత..!
జూన్ 1, 2026

Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Tollywood | నాగార్జున, రాజశేఖర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ - గ్రాండ్‌గా లాంఛ్ కానీ....
- ●ICC Meeting | టెస్టులు, టీ20ల్లో కీలక మార్పులు.. ఐసీసీ బోర్డు మీటింగ్ గ్రీన్ సిగ్నల్..
- ●Revanth Reddy | నదీ జలాల విడుదలపై ఎగువ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి: సీఎం రేవంత్
- ●72 LPA Job Offer Rejected | రూ.72 లక్షల భారీ ప్యాకేజీని రిజెక్ట్ చేసిన టెకీ: కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- ●Congress leader attacked | పిల్లలు క్రికెట్ ఆడారని తల్లిదండ్రులపై దాడి.. ఆపై పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కించుకున్న కాంగ్రెస్ నేత
- ●itel Aqua | రూ.1,799కే వాటర్‌ప్రూఫ్ ఫీచర్ ఫోన్.. ఐటెల్ ఆక్వా ఎంట్రీ..

Tollywood | నాగార్జున, రాజశేఖర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ - గ్రాండ్‌గా లాంఛ్ కానీ....

ICC Meeting | టెస్టులు, టీ20ల్లో కీలక మార్పులు.. ఐసీసీ బోర్డు మీటింగ్ గ్రీన్ సిగ్నల్..

Revanth Reddy | నదీ జలాల విడుదలపై ఎగువ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి: సీఎం రేవంత్

72 LPA Job Offer Rejected | రూ.72 లక్షల భారీ ప్యాకేజీని రిజెక్ట్ చేసిన టెకీ: కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!



