త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | రూ. 1,270 కోట్ల ప్ర‌భుత్వ‌ కాంట్రాక్టులు.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం పెమా ఖండూ కుటుంబ సంస్థ‌ల‌పై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన సుప్రీంకోర్టు

Supreme Court | అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి (Arunachal Pradesh CM) పెమా ఖండూ (Pema Khandu) కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు ₹1,270 కోట్ల విలువైన పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు ( government contracts ) దక్కడంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐ (CBI) విచారణకు (Preliminary Enquiry) ఆదేశించింది.

D

National | Published On Apr 6, 2026, 11.42 am IST

Supreme Court | రూ. 1,270 కోట్ల ప్ర‌భుత్వ‌ కాంట్రాక్టులు.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం పెమా ఖండూ కుటుంబ సంస్థ‌ల‌పై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి (Arunachal Pradesh CM) పెమా ఖండూ (Pema Khandu) కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు ₹1,270 కోట్ల విలువైన పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు ( government contracts ) దక్కడంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐ (CBI) విచారణకు (Preliminary Enquiry) ఆదేశించింది. జ‌స్టిస్ విక్ర‌మ్ నాథ్‌, సందీప్ మెహ‌తా, ఎన్‌.వి.అంజూరియాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది. కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు జరిగాయో లేదో తెలుసుకోవడానికి ప్రాథమిక దర్యాప్తు చేయాల‌ని తెలిపింది. 16 వారాల్లోగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సీబీఐని ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ముఖ్యమంత్రి పెమా ఖండూ కుటుంబ సభ్యులకు చెందిన నాలుగు సంస్థలకు ₹1,270 కోట్ల విలువైన పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఖండూ సన్నిహితులకు, ముఖ్యంగా ఆయన భార్యకు చెందిన 'మెస్సర్స్ బ్రాండ్ ఈగల్స్' అనే నిర్మాణ సంస్థకు కీలక టెండర్లను పక్షపాతంగా కేటాయించారని ఆరోపిస్తూ సేవ్ మోన్ రీజియన్ ఫెడరేషన్, వాలంటరీ అరుణాచల్ సేనా అనే సంస్థలు 2024లో సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశాయి. ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా భారీ కాంట్రాక్టుల‌ను కుటుంబ స‌భ్యుల‌కు చెందిన సంస్థ‌ల‌కు కట్టబెట్టారని పిటిష‌న్‌లో పేర్కొన్నాయి. ఈ పిటిష‌న్‌పై స్పందించిన న్యాయ‌స్థానం నవంబర్ 2015 నుంచి 2025 మధ్య కాలంలో జ‌రిగిన కాంట్రాక్టులపై ప్రాథమిక దర్యాప్తు చేయాల‌ని సీబీఐని ఆదేశించింది.

Also Read..

వేస‌వితాపం నుంచి సంర‌క్ష‌ణ‌.. అయోధ్య బాల‌రాముడికి నైవేద్యంగా ల‌స్సీ, జ్యూస్.. దీపాల‌కు బ‌దులు పువ్వుల‌తో హార‌తి

వ‌చ్చే నెల 1 నుంచి అమ‌ల్లోకి గిగ్ వ‌ర్క‌ర్ల చ‌ట్టం..

పీఎల్‌జీఏ డిప్యూటీ క‌మాండ‌ర్ సోది కేశాలు స‌హా.. పెద్ద సంఖ్య‌లో మావోయిస్టుల లొంగుబాటు!

Advertisement
Advertisement