Maoists | పీఎల్‌జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు సహా.. పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు!
Maoists | మావోయిస్టు మరో కీలక నేత తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీఎల్‌జీఏ (PLGA) డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లాతోపాటు 40 మంది మావోయిస్టులు (Maoists) సరెండర్ అయ్యారు.
Maoists | త్రినేత్ర.న్యూస్: మావోయిస్టు మరో కీలక నేత తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీఎల్‌జీఏ (PLGA) డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లాతోపాటు 40 మంది మావోయిస్టులు (Maoists) సరెండర్ అయ్యారు. వారి నుంచి ఏకే 47సహా భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగుబాటును పోలీసులు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. మల్లాతోపాటు డివిజనల్ కమిటీ సభ్యుడు మంగ్తు, ఏరియా కమిటీ సభ్యుడు మహేంద్ర, ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు మిడియమ్ రింకూ, ప్లటూన్ సభ్యులు పొడియం చంద్రి, గోన్సె భిమ్, మడకం నరేశ్, పూణెమ్ ఐథే, సోది భీమ, మొడియం రీనా, సోది రంజిత్ లొంగిపోయిన వారిలో ఉన్నట్లు తెలుస్తున్నది.
సోది కేశాలు అలియాస్ సోది కేశ పీజీఎల్ఏ డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో తన దళాన్ని నిర్వహిస్తున్నారు. బీఎన్‌పీసీ బెటాలియన్ కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2024 జనవరిలో ధర్మారం క్యాంపుపై జరిగిన దాడిలో మల్లా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2025, నవంబర్‌లో అన్నారంలో జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నారు.
కాగా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఏపీ, జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులను అణచి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే దీని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా బస్తర్ ప్రాంతాన్ని మావోయిస్టు రహిత ప్రాంతంగా లోక్‌సభ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
జులై 6, 2026

DGP CV Anand | ప్రజలకు చేరువగా పోలీసింగ్.. సాంకేతికతతో సమర్థవంతమైన సేవలు : డీజీపీ సీవీ ఆనంద్
జులై 3, 2026

Mulkanoor Constable FIR | ప్రభుత్వ టీచర్‌ను వేధించిన కానిస్టేబుల్.. కోర్టు ఎంట్రీతో సీన్ రివర్స్!
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
- ●Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని
- ●HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
- ●Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!

EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని



