Gig Workers | మే 1 నుంచి అమల్లోకి గిగ్ వర్కర్ల చట్టం..
Gig Workers | రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్ కార్మికులకు (Gig Workers) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్లాట్‌ఫాం ఆధారిత కార్మికు భరోసానిచ్చేలా రూపొందించిన గిగ్ వర్కర్ల చట్టం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది.
Gig Workers | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్ కార్మికులకు (Gig Workers) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్లాట్‌ఫాం ఆధారిత కార్మికు భరోసానిచ్చేలా రూపొందించిన గిగ్ వర్కర్ల చట్టం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కార్మిశాఖ మంత్రి వివేశ్ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేసే బోర్డులో ప్రభుత్వంతోపాటు గిగ్ వర్కర్ల యూనియన్ సభ్యులు కూడా ఉంటారని చెప్పారు. ఇకపై అగ్రిగేటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ వారి నుంచి వసూలు చేసే సెస్ నిధులను కార్మికుల ఆరోగ్య, సామాజిక భద్రతకు వినియోగిస్తామన్నారు.
ఫుడ్ డెలివరీ, రైడ్ షేరింగ్ (ఓలా, ఉబెర్), ఈ -కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న వర్కర్ల సంక్షేమానికి ఉద్దేశించిన గిగ్ వర్కర్ల (సామాజిక భద్రత సంక్షేమం) బిల్లు-2024 ను మార్చి 30న అసెంబ్లీ ఆమోదించింది. దీనిప్రకారం..
- గిగ్ కార్మికుల రిజిస్ట్రేషన్, పర్యవేక్షణకు ‘సామాజిక భద్రత , సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలు, దివ్యాంగులకు ప్రాతినిధ్యం ఉంటుంది.
- ప్లాట్‌ఫాం ఆధారిత కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూఐడీ) కేటాయిస్తారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా వారికి అందుతాయి.
- అగ్రిగేటర్లు (సంస్థలు) జరిపే లావాదేవీల నుంచి 1శాతం నుంచి 2 వరకు నిధులను సేకరించి, వాటిని సంక్షేమ నిధికి జమ చేస్తారు. ఈ నిధిని కార్మికుల బీమా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ , పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలకు ఉపయోగిస్తారు.
- యాజమాన్యాలకు, కార్మికులకు మధ్య వచ్చే తగాదాలను పరిష్కరించేందుకు బలోపేతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇబ్బందుల నివారణకు ప్లాట్‌ఫాం స్థాయి కమిటీలు పనిచేస్తాయి. కార్మికులను పనిలో నుంచి తొలగించినా లేదా పేమెంట్లు ఆపేసినా.. తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 'ప్లాట్‌ఫాం స్థాయి కమిటీలు' జిల్లా స్థాయి అధికారులతో కూడిన యంత్రాంగం ఉంటుంది.
- ఇంతకాలం యాప్ కంపెనీలు ఏ ప్రాతిపదికన ఆర్డర్లు ఇస్తున్నాయి, పేమెంట్లు ఎలా లెక్కిస్తున్నాయి అనే దానిపై స్పష్టత ఉండేది కాదు. ఇకపై యాప్ కంపెనీలు ఇష్టమొచ్చినట్లు రేట్లు తగ్గించడం, కార్మికులను ఇబ్బంది పెట్టడం కుదరదు. కార్మికులకు ఇచ్చే పేమెంట్లలో పారదర్శకత ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు విధిస్తారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



