Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
Mahesh Kumar Goud | జనగణన ప్రక్రియలో కులగణన (Caste Census) కూడా చేపట్టాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హర్షం వ్యక్తం చేశారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్: జనగణన ప్రక్రియలో కులగణన (Caste Census) కూడా చేపట్టాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కుల గణన అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నదదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా కుల గణన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని, సామాజిక న్యాయం సాధనకు కుల గణన కీలకమని స్పష్టం చేశారని పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన తప్పనిసరి అని కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో చేపట్టిన కుల సర్వే విజయవంతమైందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సంక్షేమ ఫలాల సరైన పంపిణీ కోసం కుల గణన ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తెలంగాణలో చేపట్టిన కుల సర్వే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సుప్రీం తీర్పు..
జనగణనలో కులాల లెక్కింపునకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కోట్టివేసింది. కులగణనకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరని తెలిపింది. కుల గణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఈ అంశంలో కోర్టుల జోక్యం ఉండదని స్పష్టం చేసింది.
తాజావార్తలు
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్




