Supreme Court | ఒక బంధం నుంచి విడిపోయే హక్కు పురుషులకు లేదా..? : సుప్రీంకోర్టు
Supreme Court | పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక బంధం ముగిసినంత మాత్రాన.. గతంలో పరస్పర అంగీకారంతో జరిగిన శృంగార సంబంధాలను అత్యాచార కేసులుగా మార్చడంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక బంధం ముగిసినంత మాత్రాన.. గతంలో పరస్పర అంగీకారంతో జరిగిన శృంగార సంబంధాలను అత్యాచార కేసులుగా మార్చడంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక బంధం నుంచి విడిపోయే హక్కు పురుషులకు లేదా..? అని ప్రశ్నించింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒక సంబంధం తెగిపోవడం వల్ల గతంలో పరస్పర అంగీకారంతో జరిగిన లైంగిక సంబంధాలు నేరపూరితం కావని స్పష్టం చేసింది. అలా చేయడం వ్యక్తిగత స్వేచ్ఛకు, గౌరవానికి భంగం కలిగించడమేనని తేల్చిచెప్పింది. ఇలాంటి ధోరణి వల్ల పురుషుడికి ఎలాంటి స్వయం నిర్ణయాధికారం లేకుండా పోతుందని, వారిని ఇష్టం లేని బంధంలో కొనసాగేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, పరస్పర సమ్మతితో సాగి తర్వాత విఫలమైన ప్రతి బంధాన్ని అత్యాచారం కేసుగా మార్చడం వల్ల నిజంగా లైంగిక దాడికి గురైన బాధితుల కేసుల తీవ్రత తగ్గిపోతుందని కోర్టు హెచ్చరించింది.
బంధాలు విఫలమైనప్పుడు చట్టాలను కక్షసాధింపు చర్యల కోసం ఆయుధంగా (Weaponisation of criminal law) మార్చడాన్ని సమాజం, కోర్టులు తీవ్రంగా వ్యతిరేకించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అత్యాచారం, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన వ్యక్తిని కేసుల నుంచి విముక్తి చేస్తూ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
Also Read..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్
పాఠశాలలో బాలుడి అరాచకం.. చిన్నారిపై పూల కుండీలతో పాశవిక దాడి
ఈత కొడుతుండగా కరెంట్ షాక్.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు విదేశీయులు మృతి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కారణమేమిటి..?
- ●Bollywood | బాలీవుడ్లో విషాదం - ఇంట్లోనే జారిపడి దర్శకుడు కన్నుమూత
- ●Ramchandar Rao | ప్రజాస్వామ్యం నిర్వీర్యమైతుంది.. కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: రాంచందర్‌రావు
- ●Haryana | పాఠశాలలో బాలుడి అరాచకం.. చిన్నారిపై పూల కుండీలతో పాశవిక దాడి
- ●Madhu Yashki Goud | తెలంగాణ సాధనలో పటేల్ కృషి ఉంది
- ●Punjab Assembly elections | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్

Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కారణమేమిటి..?

Bollywood | బాలీవుడ్లో విషాదం - ఇంట్లోనే జారిపడి దర్శకుడు కన్నుమూత

Ramchandar Rao | ప్రజాస్వామ్యం నిర్వీర్యమైతుంది.. కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: రాంచందర్‌రావు

Haryana | పాఠశాలలో బాలుడి అరాచకం.. చిన్నారిపై పూల కుండీలతో పాశవిక దాడి






