త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chanagani Dayakar | మియాపూర్ భూముల తీర్పు కేసీఆర్‌కు చెంప పెట్టు లాంటిది: చ‌న‌గాని ద‌యాక‌ర్‌

Chanagani Dayakar | మియాపూర్ భూముల (Miyapur Lands) విష‌యంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు కేసీఆర్‌, కేటీఆర్‌కు చెంప‌పెట్టులాంటిద‌ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చ‌న‌గాని ద‌యాక‌ర్ (Chanagani Dayakar) వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Oct 30, 2026, 4.11 pm IST

Chanagani Dayakar | మియాపూర్ భూముల తీర్పు కేసీఆర్‌కు చెంప పెట్టు లాంటిది: చ‌న‌గాని ద‌యాక‌ర్‌
Advertisement

Chanagani Dayakar | త్రినేత్ర న్యూస్‌: మియాపూర్ భూముల (Miyapur Lands) విష‌యంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు కేసీఆర్‌, కేటీఆర్‌కు చెంప‌పెట్టులాంటిద‌ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చ‌న‌గాని ద‌యాక‌ర్ (Chanagani Dayakar) వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హ‌యాంలో దోపిడీకి గురైన‌ లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను సీఎం రేవంత్‌రెడ్డి కాపాడార‌ని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని చెప్పారు. శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ భూముల దోపిడీకి కేసీఆర్ ప్ర‌భుత్వం కుట్ర చేసింద‌ని ఆరోపించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు, అభినంద‌న‌లు, కృత‌జ్ఞత‌లు. దాదాపు 50 వేల కోట్ల భూముల‌ను కాపాడిన ఘ‌న‌త రేవంత్‌రెడ్డికి ద‌క్కింది. గోల్డ్ స్టోన్ గ్రూప్‌, ట్రినిటి గ్రూప్ పేరుతో, కేంద్ర ప్ర‌భుత్వ సంక్షేమ సంఘం పేరుతో ఆనాడు ఉడా నుంచి అక్ర‌మంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేష‌న్ చేసుకొని 550 ఎక‌రాల భూమిని క‌బ్జా చేయ‌డానికి కుట్ర చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, కేటీఆర్, దామోద‌ర్‌రావుతో చేతులు క‌లిపి ఆ ప్ర‌భుత్వ భూమిని ఇవ్వ‌డానికి కుట్ర చేశారు.

రేవంత్‌రెడ్డి నిపుణులైన న్యాయ‌వాదుల‌తో మాట్లాడి సుప్రీంకోర్టు దాకా పోయి కేసు గెలిచారు. ప్ర‌భుత్వ విద్య కోసం, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల కోసం, ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోసం, ఇందిర‌మ్మ ఇండ్ల కోసం ప్ర‌భుత్వ భూమిని కాపాడారు. బీఆర్ఎస్ హ‌యాంలో ప్ర‌భుత్వ‌, అట‌వీ భూముల‌ను అన్యాక్రాంతం చేశారు. ప్రైవేటు వ్య‌క్తులతో చేతులు క‌లిపి భూ దోపిడీకి పాల్ప‌డ్డారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం గెలిచిన‌ప్ప‌టి నుంచి మియాపూర్‌, కంచ గ‌చ్చిబౌలి, మామిడిప‌ల్లి భూములు, సాయ‌బ్‌న‌గ‌ర్‌, కొండాపూర్, ఆదిలాబాద్‌, కొత్త‌గూడెం, మంచిరేవుల గ్రేహౌండ్స్ భూములు ఇలా అన్నింటిని రేవంత్‌రెడ్డి కాపాడారు. దాదాపు ల‌క్ష కోట్ల‌కు విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను ర‌క్షించారు. వాటిని ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోసం వెచ్చించిన ఘ‌న‌త రేవంత్‌కు ద‌క్కింది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌, కేటీఆర్‌కు చెంప‌పెట్టులాంటిది అని చ‌న‌గాని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్:

Chanagani DayakarGoldstone GroupHyderabadKCRKTRMiyapur LandsSupreme CourtTelanganaTrinity Group
Advertisement
Advertisement