త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రూ. 50,000 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్!

CM Revanth Reddy | బీఆర్ఎస్ అధినేత‌కేసీఆర్, ఆయన అనుచరుడైన రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, ‘గోల్డ్‌స్టోన్ ప్రసాద్’ను అడ్డుపెట్టుకుని కొల్లగొట్టాలని చూసిన రూ. 50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా ప్రభుత్వం కాపాడింది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Oct 30, 2026, 2.42 pm IST

CM Revanth Reddy | రూ. 50,000 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్!
Advertisement

గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను అడ్డం పెట్టి దోచేయాలనుకున్నారు..
కేసీఆర్, దామోద‌ర్ రావుపై మండిప‌డ్డ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ అధినేత‌కేసీఆర్, ఆయన అనుచరుడైన రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, ‘గోల్డ్‌స్టోన్ ప్రసాద్’ను అడ్డుపెట్టుకుని కొల్లగొట్టాలని చూసిన రూ. 50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా ప్రభుత్వం కాపాడింది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

మియాపూర్‌లో రూ. 50 వేల కోట్ల విలువైన భూముల ప్రభుత్వానికి చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా ప్రయత్నించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని విలువైన భూములు కబ్జాకు ప్రయత్నించారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

భూముల రక్షణకు ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు

ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా ఈ కబ్జా వ్యవహారాలపై పోరాడడంతోనే కక్ష గట్టి నన్ను జైలుకు పంపారు. మియాపూర్ భూముల విషయంలో దామోదర్ రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లు లంచంగా ఇచ్చారు. కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు ఇచ్చారు. మేం ఈ భూముల రక్షణకు ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో ఆ భూముల రక్షణకు సరైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాన‌ని సీఎం తెలిపారు.

మా ప్రభుత్వం వచ్చాక రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించాం

కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కబ్జాల నుంచి భూములను రక్షించే ప్రయత్నిస్తున్నాం. ఈ విలువైన భూములను విక్రయించి నీటిపారుదల, విద్యా, వైద్య తదితర రంగాలకు కేటాయిస్తాం. ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చిస్తాం. మా ప్రభుత్వం వచ్చాక రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించాం. ఐఎంజీ భూములను భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై కేటీఆర్ కొట్టేయాలని చూస్తే న్యాయపోరాటంతో అడ్డుకున్నాం. కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తే న్యాయపోరాటంలో గెలిచాం. గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జాకు ప్రయత్నిస్తే సుప్రీంకోర్టులో పోరాడాం. ప్రభుత్వం పోరాటంతో అది అటవీ భూమి అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మంచిరేవుల లో 143 ఎకరాల భూమిని కేటీఆర్ రాయలసీమ బిల్డర్స్‌తో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తే దానిని రక్షించాం. అందులో పోలీసుల పిల్లల కోసం స్కూల్ పెట్టామ‌ని గుర్తు చేశారు.

సుప్రీంకోర్టులో పోరాడి రక్షించాం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కు నజరానాగా అప్పగిస్తే సుప్రీంకోర్టులో పోరాడి రక్షించాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల భూ ఆక్రమణలను అడ్డుకున్నాం. వనరుల సమీకరణకు నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ఈ భూముల విక్రయం.. వచ్చే ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై అధ్యయనం చేస్తుంది. హరీష్ రావు మామ హనుమంత రావు కబ్జా పెట్టిన భూములు సర్వే చేయకుండా అధికారులను అడ్డుకుంటున్నారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. భూముల ఆక్రమణపై బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారని రేవంత్ పేర్కొన్నారు.

తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు

శాసనసభలో చర్చించి చర్యలకు దిగితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎందుకు బీఆర్ఎస్ నాయకులు స్పందించడం లేదు. కనీసం రెవెన్యూ అధికారులను ఎందుకు బీఆర్ఎస్ నాయకులు అభినందించడం లేదు. పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీష్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పై కేసులు వేశారో వారితో కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారు. మియాపూర్ భూములపై ఇప్పటికైనా కుట్రలు మానాలి. మియాపూర్ భూముల విక్రయంతో వచ్చే నిధులను విద్యాభివృద్ధికి వినియోగిస్తాం. వాళ్ల భూముల ఆక్రమణలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సీఎం డిమాండ్ చేశారు.

ట్యాగ్స్:

CM Revanth ReddyCongress GovtDamoder RaoKCRMiyapur LandsSupreme CourtTelangana
Advertisement
Advertisement