త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood | బాలీవుడ్‌లో విషాదం – ఇంట్లోనే జారిప‌డి ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సంజ‌య్ గుప్తా నివాసంలోనే జారిప‌డ‌టంతో తల‌కు బ‌ల‌మైన గాయ‌మై క‌న్నుమూశారు. కాంటే, కాంబిల్‌, ఆతీష్, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలాతో పాటు ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంజ‌య్‌ద‌త్‌, హృతిక్ రోష‌న్ వంటి స్టార్ల‌తో సినిమాలు చేశారు.

N

Entertainment | Published On Oct 31, 2026, 2.11 pm IST

Bollywood | బాలీవుడ్‌లో విషాదం – ఇంట్లోనే జారిప‌డి ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌
Advertisement

Bollywood | బాలీవుడ్  (Bollywood))ద‌ర్శ‌కుడు సంజ‌య్ గుప్తా ప్ర‌మాద‌వ‌శాత్తూ క‌న్నుమూశారు. ఇంట్లోనే జారిప‌డిన ఆయ‌న త‌ల‌కు బ‌ల‌మైన గాయం త‌గ‌ల‌డంతో అధిక ర‌క్త‌స్రావం కార‌ణంగా శుక్ర‌వారం తుదిశ్వాస విడిచారు. హిందీ సినీ పరిశ్రమలో ద‌ర్శ‌క‌నిర్మాత‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు చేశారు సంజ‌య్ గుప్తా.

ఆతీష్‌తో...

1994లో రిలీజైన ఆతీష్ మూవీతో ద‌ర్శ‌కుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సంజ‌య్ గుప్తా. సంజ‌య్ ద‌త్ (Sanjay Dutt) హీరోగా న‌టించిన ఈ మూవీ పెద్ద విజ‌యాన్ని సాధించింది. ద‌ర్శ‌కుడిగా సంజ‌య్ గుప్తాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ త‌ర్వాత షుటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, షుటౌట్ ఎట్ వాదాలా, కాంటే, కాబిల్‌, ముంబై సాగా వంటి సినిమాల‌తో  ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటారు. 30 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో ఎక్కువ‌గా అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా, గ్యాంగ్‌స్ట‌ర్‌, యాక్ష‌న్ సినిమాలు చేశారు. ద‌ర్శ‌కుడిగా చివ‌ర‌గా 2024లో ది మిరండా బ్ర‌ద‌ర్స్ అనే సినిమాను తెర‌కెక్కించారు సంజ‌య్ గుప్తా. ఈ సినిమాలో టాలీవుడ్ న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే హీరోగా క‌నిపించారు. సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అన్ని సినిమాలు హాలీవుడ్ (Hollywood) రీమేక్‌లు కావ‌డం గ‌మ‌నార్హం. సంజ‌య్‌ద‌త్‌, అజ‌య్‌దేవ్‌గ‌ణ్ హృతిక్ రోష‌న్‌, జాన్ అబ్ర‌హ‌మ్ వంటి స్టార్ల‌తో ప‌నిచేశారు. మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు బాలీవుడ్‌లో కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. వైట్ ఫెద‌ర్ ఫిల్మ్స్ అనే బ్యాన‌ర్‌పై కొన్ని హిందీ సినిమాల‌ను నిర్మించారు.

విడాకులు తీసుకొని మ‌ళ్లీపెళ్లి...

మిసెస్ వ‌ర‌ల్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ అయిన అనురాధ లేఖి గుప్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సంజ‌య్ గుప్తా. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఇద్ద‌రు విడిపోయారు. విడాకులు తీసుకున్న ఆరేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

 

ట్యాగ్స్:

BollywoodDirector Sanjay GuptaHindi CinemaSanjay Gupta DeathSanjay Gupta MoviesSanjay Gupta Passes Away
Advertisement
Advertisement