Haryana | పాఠశాలలో బాలుడి అరాచకం.. చిన్నారిపై పూల కుండీలతో పాశవిక దాడి
Haryana | హర్యానా (Haryana)లో ఓ పాఠశాల క్లాస్‌రూమ్‌లో కిండర్‌గార్టెన్ చిన్నారిపై (kindergarten girl) మూడో తరగతి బాలుడు పాశవిక దాడికి పాల్పడ్డాడు. రాళ్లు, పూల కుండీలతో (flower pot) విచక్షణారహితంగా దాడి చేశాడు.
Haryana | త్రినేత్ర న్యూస్ : హర్యానా (Haryana)లో దారుణ ఘటన వెలుగు చూసింది. పంచకుల (Panchkula)లోని ఓ పాఠశాల క్లాస్‌రూమ్‌లో కిండర్‌గార్టెన్ చిన్నారిపై మూడో తరగతి బాలుడు పాశవిక దాడికి పాల్పడ్డాడు. రాళ్లు, పూల కుండీలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ భయానక ఘటన సంస్కృతి మోడల్ స్కూల్‌లో (Sanskriti Model School) అక్టోబర్ 28న చోటు చేసుకోగా తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎనిమిదేళ్ల బాలుడు ఆరేళ్ల చిన్నారిని బలవంతంగా క్లాస్‌రూమ్‌లోకి ఈడ్చుకెళ్లాడు. అక్కడ చిన్నారి తలను డెస్క్‌కు వేసి రెండుసార్లు బలంగా బాదాడు. అనంతరం నేలపై పడేసి కాళ్లతో దారుణంగా తన్నాడు. అంతటితో ఆగని బాలుడు రాళ్లు, పూలకుండీలతో చిన్నారిపై పదేపదే దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడి రక్తపు మడుగుల్లో స్పృహ కోల్పోయి పడిపోయింది. అయినప్పటికీ ఏ మాత్రం కనికరం చూపని బాలుడు.. బాలికను మళ్లీ ఈడ్చుకెళ్లి కాళ్లతో తంతూ అరాచకం సృష్టించాడు.
ఈ ఘటనతో తోటి విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న బాధిత చిన్నారి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. వాళ్లు రాగానే దారుణానికి ఒడిగట్టిన బాలుడే వారిని స్వయంగా ఘటనాస్థలికి తీసుకెళ్లి మీ అమ్మాయి ఇక్కడ పడి ఉంది అని చెప్పడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. బాలిక పరిస్థితి చూసి కంగుతిన్న తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే సెక్టార్ 6లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం చండీగఢ్ పీజీఐకి (PGI Chandigarh) తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంత చిన్న వయసులోనే బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు బాలుడి తల్లిదండ్రులను విచారిస్తున్నారు. కాగా, హింసాత్మక దాడులకు సంబంధించి గతంలోనూ పలుమార్లు బాలుడిపై అనేక ఫిర్యాదులు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు తాజా ఘటన నేపథ్యంలో పాఠశాలల్లో పిల్లల భద్రత, స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు ఈ ఘటనపై హర్యానా విద్యాశాఖ మంత్రి మహిపాల్ ధండా స్పందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు.
A shocking incident inside a school! A KG student was allegedly brutally attacked by a Class 3 student using stones and a flowerpot. This is a serious school safety failure sanskriti Model school
We demand an immediate investigation, strict action and accountability from the school authorities. Children deserve safety, not violence!
#SchoolSafety #Panchkula #Haryana #JusticeForChild #BreakingNews #India #viralvideo
— Irfan Ansari (@Irfan_Ansari777) October 31, 2026
Also Read..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్
ఈత కొడుతుండగా కరెంట్ షాక్.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు విదేశీయులు మృతి
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Madhu Yashki Goud | తెలంగాణ సాధనలో పటేల్ కృషి ఉంది
- ●Punjab Assembly elections | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్
- ●Maserati | భారత్‌లో లాంచ్ అయిన మసెరటి ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 540 కిలోమీటర్లు వెళ్లవచ్చు..
- ●Seethakka | పింఛన్ వచ్చే భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్: మంత్రి సీతక్క
- ●HYDRAA | రామంతాపూర్‌లోని పెద్ద చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు..
- ●Bengaluru 5 Star Hotel | ఈత కొడుతుండగా కరెంట్ షాక్.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు విదేశీయులు మృతి

Madhu Yashki Goud | తెలంగాణ సాధనలో పటేల్ కృషి ఉంది

Punjab Assembly elections | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్

Maserati | భారత్‌లో లాంచ్ అయిన మసెరటి ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 540 కిలోమీటర్లు వెళ్లవచ్చు..

Seethakka | పింఛన్ వచ్చే భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్: మంత్రి సీతక్క






