త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhu Yashki Goud | తెలంగాణ సాధ‌న‌లో ప‌టేల్ కృషి ఉంది

Madhu Yashki Goud | ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ కృషి ఉంద‌ని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhu Yashki Goud) వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Oct 31, 2026, 1.39 pm IST

Madhu Yashki Goud | తెలంగాణ సాధ‌న‌లో ప‌టేల్ కృషి ఉంది
Advertisement
  • మ‌హోన్న‌తుల‌కు రాజ‌కీయాలు అంట‌గ‌ట్టొద్దు
  • ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ గౌడ్‌

Madhu Yashki Goud | త్రినేత్ర న్యూస్: ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ కృషి ఉంద‌ని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhu Yashki Goud) వ్యాఖ్యానించారు. మ‌హోన్న‌తులను పార్టీల‌క‌తీతంగా స్మ‌రించుకోవ‌డం ప్ర‌తి భార‌తీయుడి ధ‌ర్మం అని చెప్పారు. ప‌టేల్‌, ఇందిర‌మ్మ చూపిచ్చిన బాట‌లో ప్రజా ప్ర‌భుత్వం కొనసాగుతుంద‌న్నారు. ప‌టేల్ జ‌యంతి, ఇందిరాగాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా శ‌నివారం గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మాశంలో ఆయ‌న మాట్లాడారు. దేశం కోసం కొట్లాడిన నాయ‌కుల‌కు కేంద్రం రాజ‌కీయం అంటిపెడుతోంద‌ని ఆరోపించారు.

ప‌టేల్ జ‌యంతి, ఇందిరా గాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా వారికి నివాళి అర్పిస్తున్నం. భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంలో నెహ్రూతో క‌లిసి ప‌టేల్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ ప్రాంతానికి, హైద‌రాబాద్ రాష్ట్రాన్ని నిజాం, ర‌జాకార్ల నుంచి విముక్తి క‌ల్పించారు. హైద‌రాబాద్ రాష్ట్రం, స‌మైక్యాంధ్ర, త‌ర్వాత తెలంగాణ వ‌చ్చిందంటే ప‌టేల్ కృషి ఉంది. చిన్న చిన్న రాజ్యాల‌ను క‌లిపి అఖండ భార‌త‌దేశాన్ని నిర్మించారు.

పేదల కోసం ప్ర‌జా ప్ర‌భుత్వం

ఇందిరాగాంధీ త‌న ఆఖ‌రి రక్త‌పు బొట్టును దేశం కోసం అర్పించారు. ప్ర‌జా ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ పేరుతో ఇవాళ పేద‌ల‌కు ఇళ్లు, స‌న్న బియ్యం అందిస్తుంది. ఇందిర‌మ్మ‌, ప‌టేల్ చూపిచ్చిన దారిలో ఈ ప్ర‌జా ప్ర‌భుత్వం కొన‌సాగుతుంది. సోనియాగాంధీ, ఖ‌ర్గే, రాహుల్ గాంధీ చూపిచ్చిన దారిలో రేవంత్ హ‌యాంలోని ప్ర‌భుత్వం పేద‌ల కోసం ప‌ని చేస్తున్నది. పేదిరికాన్ని రూపుమాపేందుకు చిత్త‌శుద్ధితోటి ప‌ని చేస్తుంది.

కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం రాజకీయం చేస్తుంది. దేశం కోసం కొట్లాడిన నాయ‌కుల‌కు రాజ‌కీయం అంటిపెట్టొద్దు. కేంద్ర ప్ర‌భుత్వానికి దుర్బుద్ది ఉంది. మ‌హోన్న‌తులు ఏ పార్టీవారైనా వారిని స్మ‌రించుకోవాలి. ఇది ప్ర‌తి భార‌తీయుడి ధ‌ర్మంగా భావిస్తున్నం అని మ‌ధుయాష్కీ గౌడ్ అన్నారు.

ట్యాగ్స్:

Birth And Death AnniversaryIndira GandhiMadhu Yashki GoudRevanth ReddySardar Vallabhbhai PatelTelangana
Advertisement
Advertisement