Giacomo Filibeck | భారత్ సమ్మిట్‌లో ఓట్ చోరీ నినాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Giacomo Filibeck | భారత్ సమ్మిట్ (Bharat Summit 2026)లో ఇటలీ రాజకీయ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck) ఓట్ చోరీ నినాదంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది.
Giacomo Filibeck | త్రినేత్ర న్యూస్ : భారత్ సమ్మిట్ (Bharat Summit 2026)లో ఇటలీ రాజకీయ నాయకుడు, యూరోపియన్ సోషలిస్ట్స్ పార్టీ సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck) కాంగ్రెస్‌కు మద్దతుగా ‘‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’’(ఓట్ల దొంగ అధికారం నుంచి దిగిపోవాలి) అంటూ నినదించిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విదేశీ అతిథుల ప్రసంగాలను నియంత్రించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఈ పిటిషన్ ఏ రాజకీయ నాయకుడికో, రాహుల్ గాంధీకో, తెలంగాణ ముఖ్యమంత్రికో వ్యతిరేకంగా వేసింది కాదని.. మేము ఎవరిపైనా శిక్షాత్మక చర్యలు కోరడం లేదని పేర్కొన్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించేలా ఆదేశించాలని కోరారు. మన దేశ గడ్డపై నిలబడి ఇక్కడి ప్రభుత్వం అవినీతిమయమైందని విదేశీ వ్యక్తి తీర్పు చెప్పడం తీవ్ర ఉల్లంఘన అని పేర్కొన్నారు.
పిటిషనర్ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. "ముందుగా ఈ దేశ పౌరుల ప్రసంగాలను ప్రభుత్వం నియంత్రించగలదనే అంశాన్ని మీరు నిరూపించాలి. ఆ తర్వాతే విదేశీయుల ప్రసంగాల నియంత్రణ గురించి మాట్లాడాలి" అని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రశ్నించిన ధర్మాసనం.. సదరు వ్యక్తిపై అభ్యంతరం ఉంటే సంబంధిత చట్టపరమైన ఫిర్యాదు చేసుకోవచ్చని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇదీ వివాదం..
నవంబర్ 13, 14 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 'భారత్ సమిట్ 2026' జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (PES) సెక్రటరీ జనరల్, ఇటలీ నేత గియాకోమో ఫిలిబెక్ పాల్గొన్నారు. సదస్సులో ఫిలిబెక్ మాట్లాడుతూ.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రచారాన్ని సమర్థించారు. అంతేకాకుండా, భారత ఎన్నికల ప్రక్రియను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ "ఓట్ చోర్.. గద్దీ ఛోడ్" (Vote Chor, Gaddi Chhod) అంటూ స్టేజ్‌పై నినదించారు. ఇతర విదేశీ ప్రతినిధుల కోసం దానిని ఆంగ్లంలోకి అనువదించి మరీ వివరించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చలరేగింది. కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చిన ఓ విదేశీ ప్రతినిధి.. దేశ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జాహిద్ అలీ అనే వ్యక్తి సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చిన విదేశీయులు దేశ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాజకీయ నినాదాలు చేయడం హోం మంత్రిత్వ శాఖ వీసా నిబంధనలకు విరుద్ధమని వాదించారు.
Also Read..
డీలిమిటేషన్‌పై రాజీ ప్రసక్తే లేదు : డీఎంకే
బీజేపీకి ఇదే అతిపెద్ద రాజకీయ తప్పిదం కానుంది : అఖిలేష్ యాదవ్
రాహుల్ గాంధీకి గోరుముద్దలే కదా తినిపించాం.. తప్పేముంది?: దాసోజు శ్రవణ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్
నవంబర్ 28, 2026

Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏళ్ల తర్వాత వెలిగిన కార్తీక దీపం.. భక్తులు భావోద్వేగం
నవంబర్ 28, 2026

Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
- ●Serial Actor | పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ యాక్టర్ - ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●BRS Australia | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్
- ●Delimitation & Constitutional Imbalance | లోక్‌సభ సీట్ల పెంపు సరే .. మరి రాజ్యసభ సంగతేంది?
- ●RIMS Incident | గర్భిణీ మృతి ఘటన.. రిమ్స్ వైద్యురాలికి ఉద్వాసన
- ●Bigg Boss Mukesh Gowda | బిగ్‌బాస్ ముఖేష్ గౌడ తెలుగు సినిమా - లవ్‌స్టోరీతో హీరోగా ఎంట్రీ..

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

Serial Actor | పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ యాక్టర్ - ఫొటోలపై ఓ లుక్కేయండి!

BRS Australia | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్

Delimitation & Constitutional Imbalance | లోక్‌సభ సీట్ల పెంపు సరే .. మరి రాజ్యసభ సంగతేంది?



