Supreme Court | రిజర్వ్ చేసిన మూడు నెలల్లోనే తుది తీర్పు వెల్లడించాలి: హైకోర్టులకు సుప్రీం కీలక ఆదేశాలు
Supreme Court | ఏదైనా తీర్పును రిజర్వ్ చేసిన మూడు నెలల్లోపే తుది తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని హైకోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court | ఏదైనా తీర్పును రిజర్వ్ చేసిన మూడు నెలల్లోపే తుది తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని హైకోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్థలో అనవసరమైన జాప్యాన్ని నివారించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Surya Kant) నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
తీర్పుల్లో ఆలస్యం వల్ల వ్యాజ్యదారులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. రిజర్వ్ చేసిన తీర్పులను అనవసరంగా ఆలస్యం చేయొద్దని అన్ని హైకోర్టులకు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన తేదీ నుండి మూడు నెలల వ్యవధిలోనే తుది తీర్పును ప్రకటించాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున ప్రకటించాలని, ఒకవేళ ఆర్డర్‌ను రిజర్వ్ చేసినట్లైతే.. మరుసటి రోజే ప్రకటించి అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
తీర్పుల జాప్యంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ఇవే..
- రిజర్వ్ చేసిన తీర్పులను అనవసరంగా ఆలస్యం చేయొద్దు.
- తీర్పు ప్రకటించిన తర్వాత పూర్తి కారణాలతో కూడిన కాపీని సాధారణంగా 7 రోజుల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్ఠంగా 15 రోజుల్లోపు తీర్పును అప్‌లోడ్ చేయాలి.
- బహిరంగంగా ప్రకటించిన తీర్పును 24 గంటల్లోపు హైకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి.
- రిజర్వ్ చేసిన కేసులో 3 నెలలు దాటినా తీర్పు వెలువడకపోతే, ఆ విషయం సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలి.
- బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున ప్రకటించాలి.. ఒకవేళ ఆ రోజు ఆలస్యమైతే మరుసటి రోజే తీర్పును వెల్లడించాలి.
- విచారణలోని ఖైదీలను బెయిల్ మంజూరైన రోజే విడుదల చేయాలి.
- జార్ఖండ్ హైకోర్టులో తీర్పుల వెలువరించడంలో జరుగుతున్న ఆలస్యానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
- న్యాయ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన న్యాయాన్ని నిర్ధారించడమే ఈ మార్గదర్శకాల ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read..
నా కుమారుడికి కీలక మంత్రిత్వ శాఖను కేటాయించండి.. హైకమాండ్‌ను కోరిన సిద్ధరామయ్య
ప్రతి ఓటునూ చూసుకోవాలి.. లేదంటే బెంగాల్ తరహా కుట్రలు జరుగుతాయ్: మహేశ్‌కుమార్‌గౌడ్
తాజావార్తలు
- ●NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..
- ●Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు
- ●CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!
- ●Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు
- ●Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
- ●Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..

Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు

CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!

Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు






