Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
Telangana Formation Day | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. 2026 జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు.
Telangana Formation Day | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. 2026 జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో జెండాలను ఎగుర వేసే ప్రముఖుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేసింది. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో 8.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రాల్లో కూడా సమాంతరంగా వేడుకలు జరగనున్నాయి. ముఖ్యంగా అమరవీరుల స్మారక స్థలాల వద్ద ముందుగా పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాల్లోని కలెక్టర్లు, ఎస్పీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించనున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు.
ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. జిల్లా కలెక్టరేట్లను సుందరంగా అలంకరించడంతో పాటు విద్యుత్ దీపాలతో ప్రకాశవంతంగా తీర్చిదిద్దాలని సూచించింది. అవసరమైతే కలెక్టరేట్ ప్రాంగణంలో తగిన స్థలంలో ‘టీ ఎరేంజ్‌మెంట్స్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే రాష్ట్ర చిహ్నాలు, తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవం తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధిపతులు జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులు కూడా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ప్లాస్టిక్ జెండాల వినియోగాన్ని నివారించాలని, ఫ్లాగ్ కోడ్ 2002ను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలో అన్ని కార్యక్రమాలు సమన్వయంతో, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల భాగస్వామ్యంతో, గౌరవప్రదంగా జరపాలని ప్రభుత్వం సూచించింది.
జెండా ఆవిష్కరణించే ప్రముఖులు వీరే..
ఆదిలాబాద్ : షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారు
భద్రాద్రి కొత్తగూడెం : తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి
హనుమకొండ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి
జగిత్యాల : మహ్మద్ అజారుద్దీన్, మంత్రి
జయశంకర్ భూపాలపల్లి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్
జనగాం : బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్
జోగులాంబ గద్వాల్ : జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు
కామారెడ్డి : వీ హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు
కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి
ఖమ్మం : భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
కుమురంభీం ఆసిఫాబాద్ : బండ ప్రకాశ్, మండలి డిప్యూటీ చైర్మన్
మహబూబాబాద్ : జీ రాంచందర్ నాయక్, ప్రభుత్వ విప్
మహబూబ్‌నగర్ : జూపల్లి కృష్ణారావు, మంత్రి
మంచిర్యాల : హరకర గోపాలరావు, ప్రభుత్వ సలహాదారు
మెదక్ : వివేక్ వెంకటస్వామి, మంత్రి
మేడ్చల్ : కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారులు
ములుగు : సీతక్క, మంత్రి
నాగర్‌కర్నూల్ : జీ చిన్నారెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్
నల్గొండ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి
నారాయణపేట : వాకిటి శ్రీహరి, మంత్రి
నిర్మల్ : వేముల వీరేశం, ప్రభుత్వ విప్
నిజామాబాద్ : సుధాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు
పెద్దపల్లి : చింతకుంట విజయ రమణారావు, ప్రభుత్వ విప్
రాజన్న సిరిసిల్ల : ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
రంగారెడ్డి : దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి
సంగారెడ్డి : దామోదర రాజనరసింహ, మంత్రి
సిద్దిపేట : పొన్నం ప్రభాకర్, మంత్రి
సూర్యాపేట : ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి
వికారాబాద్ : గడ్డం ప్రసాద్ కుమార్, అసెంబ్లీ స్పీకర్
వనపర్తి : పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్
వరంగల్ – కొండా సురేఖ, మంత్రి
యాదాద్రి భువనగిరి : గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి చైర్మన్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన
- ●Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!
- ●Delhi Dust Storm | ఢిల్లీని వణికించిన గాలి దుమారం: గంటకు 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షం
- ●Char Dham Yatra | బద్రీనాథ్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్.. భక్తులకు తీవ్ర అవస్థలు..!

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన

Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!




