త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీల నియామ‌కంపై ‘సుప్రీం’లో విచార‌ణ‌.. ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ

Supreme Court | గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై శుక్ర‌వారం దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. రెండు అప్లికేషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అప్లికేషన్లను ప్రధాన కేసుతోనే విచారిస్తామని ధర్మాసనం వెల్ల‌డించింది.

S

Telangana | Published On May 29, 2026, 2.36 pm IST

Supreme Court | గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీల నియామ‌కంపై ‘సుప్రీం’లో విచార‌ణ‌.. ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్‌: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై శుక్ర‌వారం దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. అమీర్‌ అలీఖాన్‌, అజారుద్దీన్ ఇంటర్‌లోకేటరీ (Interlocutory Application) అప్లికేషన్లు దాఖలు చేశార‌ని.. ఈ కేసు విచారణను జులై 22న విచారిస్తామ‌ని ఇప్ప‌టికే తెలిపామ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే గ‌త విచార‌ణ స‌మ‌యంలో కోర్టుకు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని అజారుద్దీన్ త‌ర‌ఫు న్యాయ‌వాది ధర్మాస‌నం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే ఐఏ దాఖలు చేసినట్లు తెలిపారు.

గతంలో గవర్నర్ తన పేరునే సూచించి అనంత‌రం నిర్ణయం మార్చుకున్నారని ఈ సంద‌ర్భంగా అమీర్‌ అలీఖాన్ తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం జరిగిన విష‌యంలో గవర్నర్‌ ఏం చేయ‌గ‌ల‌ర‌ని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. అయితే ఇరువురి అప్లికేషన్లను ప్రధాన కేసుతోనే విచారిస్తామని ధర్మాసనం వెల్ల‌డించింది. రెండు అప్లికేషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 22కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement