Kedarnath Mule Viral Video | కేదార్‌నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
కేదార్‌నాథ్ యాత్రలో ఓ మూగజీవిపై 140 కిలోల బరువున్న వ్యక్తి ప్రయాణించిన వీడియో వైరల్‌గా మారింది. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Viral news | Published On May 30, 2026, 10.00 pm IST
- కేదార్‌నాథ్ యాత్రలో సుమారు 140 కిలోల బరువున్న ఓ వ్యక్తి కంచరగాడిద (mule) పై కొండెక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- 18 కిలోమీటర్ల మేర సాగే ఈ కఠినమైన ట్రెక్కింగ్‌లో ఆ మూగజీవి పడుతున్న ఆవేదన చూసి నెటిజన్లు ఆగ్రహం
- భక్తి పేరుతో జంతువులను ఇలా హింసించడం పాపమంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
- మరికొందరు మాత్రం, స్థానికుల ఉపాధికి ఇవే ఆధారమని.. జంతువులకు బదులు కేబుల్ కార్ల వంటి టెక్నాలజీ వాడాలని సూచన
Kedarnath Mule Viral Video | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదార్‌నాథ్ యాత్రలో (Kedarnath Yatra) ఓ మూగజీవి పడుతున్న నరకయాతన నెటిజన్లను కలచివేస్తోంది. సుమారు 140 కిలోల భారీ బరువున్న ఓ వ్యక్తి కంచరగాడిద (Mule) పై కూర్చొని కొండెక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో భక్తికి, మూగజీవాల హింసకు (Animal cruelty) మధ్య ఉన్న సన్నని గీత ఎక్కడుంది అన్న విషయంపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చే నడుస్తోంది.
18 కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్
హిమాలయాల్లో 3,583 మీటర్ల ఎత్తులో ఉండే కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకోవడం అంత సులభం కాదు. గౌరీకుండ్ నుంచి సుమారు 16 నుంచి 18 కిలోమీటర్ల మేర సాగే అత్యంత కఠినమైన, ఎత్తైన ట్రెక్కింగ్ (Trek) చేయాల్సి ఉంటుంది. నడవలేని వేలాది మంది భక్తులు గుర్రాలు, కంచరగాడిదలను ఆశ్రయిస్తారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. లైట్ బ్లూ టీ-షర్ట్ వేసుకున్న ఓ భారీకాయుడిని మోస్తూ ఓ కంచరగాడిద అడుగులు వేయలేక తీవ్రంగా ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి బరువు సుమారు 140 కిలోలు ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
"పుణ్యం కంటే పాపమే ఎక్కువ.."
ఈ క్లిప్ బయటకు రాగానే నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. "18 కిలోమీటర్ల ఎత్తైన కొండపైకి 140 కిలోల వ్యక్తిని మోసుకెళ్లడం కచ్చితంగా జంతువులపై క్రూరత్వమే (Animal abuse). పుణ్యక్షేత్రాల్లో ఈ యానిమల్ రైడ్స్‌పై కఠినమైన బరువు నిబంధనలు ఎప్పుడు తెస్తారు?" అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. "అన్నా.. నువ్వు ఇలా వెళ్లి పుణ్యం కంటే పాపమే ఎక్కువ మూటగట్టుకున్నావ్. దీనికంటే ఇంట్లోనే ఉండాల్సింది" అంటూ మరొకరు ఫైర్ అయ్యారు. దేవుడు ఎప్పుడూ మూగజీవాలను హింసించి భక్తిని చాటుకోమని అడగడని పలువురు చురకలు అంటించారు. ఆ మూగజీవి కాళ్లు వణుకుతున్నా, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కౌంటర్లు
అయితే, ఈ వాదనను వ్యతిరేకిస్తున్న వారు కూడా లేకపోలేదు. కేదార్‌నాథ్ యాత్రలో ఏళ్ల తరబడి ఈ గుర్రాలు, కంచరగాడిదలు ఒక భాగమని.. భక్తులకు, స్థానిక కార్మికుల ఉపాధికి (Livelihood) ఇవే ఆధారమని వారు గుర్తుచేస్తున్నారు. "మాంసం కోసం జంతువులను చంపడం క్రూరత్వం అనిపించదు కానీ.. ఒకరికి ఉపాధి కల్పించడానికి, నడవలేని వారిని దేవుడి దగ్గరకు చేర్చడానికి జంతువును వాడితే అది క్రూరత్వమా?" అని ఒక యూజర్ కౌంటర్ ఇచ్చారు. అది అక్కడి సిస్టమ్ అని, జంతువుల వినియోగాన్ని పూర్తిగా ఆపేసి దానికి బదులు కేబుల్ కార్లు (Cable cars) లాంటి ఎలక్ట్రిక్ టెక్నాలజీని తీసుకురావాలని సూచించారు.
ఏది ఏమైనా పవిత్ర పుణ్యక్షేత్రాల వద్ద జంతువులతో ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని, ప్రయాణించే భక్తుల బరువుపై కఠిన పరిమితులు (Weight limits) విధించాల్సిన సమయం ఆసన్నమైందని మెజారిటీ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
This mule is forced to carry 140 kg man for an 18 km uphill trek in Kedarnath. This is heartbreaking and blatant animal abuse. When will we start enforcing strict weight limits for animal rides at pilgrimage sites? @pushkardhami @IYCUttarakhand @ASPCA @UTDBofficial @ukcmo pic.twitter.com/AMCmIe4dYN
— yash saghal (@YSaghal) May 24, 2026
సంబంధిత వార్తలు

Truck rams car | షాకింగ్.. కారును ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు
మే 30, 2026

Vaibhav Sooryavanshi | సూర్యవంశీ బ్యాంటింగ్.. చాగంటి కోటేశ్వర రావు కామెంట్రీ.. మీరూ చూసేయండి
మే 29, 2026

Kangana Ranaut | మెడలో తాళితో కంగనా రనౌత్ – సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? – నెటిజన్ల కామెంట్లు వైరల్
మే 22, 2026
తాజావార్తలు
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన
- ●Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!



