Illegal Immigrants | భారత్‌లోకి చొరబాట్లు.. టీఎంసీ కార్యకర్తల సహకారంతోనే.. సంచలన విషయాలు వెల్లడించిన బంగ్లాదేశీ వలసదారులు
Illegal Immigrants | పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) సువేందు అధికారి (CM Suvendu Adhikari) ప్రభుత్వం అక్రమ వలసలపై (illegal immigrants) ఉక్కుపాదం మోపుతోంది. ఈ సందర్భంగా వలసదారులు కీలక విషయాలను వెల్లడించారు. తాము ఎలా సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించామో, ఎలా గుర్తింపు పత్రాలు పొందామో బహిర్గతం చేశారు.
Illegal Immigrants | పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) సువేందు అధికారి (CM Suvendu Adhikari) ప్రభుత్వం అక్రమ వలసలపై (illegal immigrants) ఉక్కుపాదం మోపుతోంది. బంగ్లాదేశీ వలసదారులపై కఠిన చర్యలు చేపడుతోంది. బెంగాల్ నుంచి వెళ్లగొట్టకముందే పారిపోవాలని సీఎం సువేందు చొరబాటుదారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని, డిటెన్షన్ కేంద్రాలకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం వార్నింగ్‌తో వందలాది మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సరిహద్దులు, రవాణా కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. వీరిలో దశాబ్దాలుగా భారత్‌లో నివాసం ఉంటున్నవారు ఉన్నారు.
10 నిమిషాల్లో భారత్‌లోకి..
ఈ సందర్భంగా వలసదారులు కీలక విషయాలను వెల్లడించారు. తాము ఎలా సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించామో, ఎలా గుర్తింపు పత్రాలు పొందామో బహిర్గతం చేశారు. కొందరు తాము నదులు దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు చెప్పారు. మరికొందరు 'దలాల్'లుగా పిలిచే మధ్యవర్తులు రాత్రివేళల్లో బీఎస్‌ఎఫ్ గస్తీని గమనిస్తూ, గ్యాప్ దొరికిన వెంటనే తమను భారత్‌లోకి పంపేవారని వెల్లడించారు. "దలాల్‌కు ఓ నెట్ వర్క్ ఉంటుంది. రాత్రి వేళల్లో ఏ ప్రాంతంలో బీఎస్ఎఫ్ నిఘా ఉందో.. ఎక్కడ లేదో వారు ముందు తనిఖీ చేస్తారు. గ్యాప్ దొరకగానే సరిహద్దు దాటించేస్తారు. ఒక్కోసారి రాత్రంతా అవకాశం కోసం వేచి ఉండాల్సి వచ్చేది. మరికొన్నిసార్లు పది నిమిషాల్లోనే భారత్‌లోకి తీసుకువచ్చేవారు" అని ఓ వ్యక్తి వివరించాడు.
ఇలా సరిహద్దులు దాటించినందుకు మధ్యవర్తులు ఒక్కొక్క వలసదారుడి నుంచి రూ.7,000 నుంచి రూ.8,000 వరకు తీసుకునేవారని పేర్కొన్నారు. మరో బంగ్లాదేశీ వ్యక్తి మాట్లాడుతూ.. సైనిక భద్రత ఉన్నప్పటికీ రూ.20,000 చెల్లించి భారత్‌లోకి ప్రవేశించానని తెలిపాడు. "ఆధార్ కార్డు కోసం మరో రూ.2,000 నుంచి రూ.3,000 ఖర్చయింది. తర్వాత రైలులో బెంగళూరుకు చేరుకున్నా" అని చెప్పాడు.
టీఎంసీ కార్యకర్తలే సాయం చేశారు..
గతంలో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తల ద్వారా తాము గుర్తింపు కార్డులు, ఓటరు కార్డులను పొందామని పలువురు వలసదారులు సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాదు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా తాము నగదు ప్రయోజనాలను కూడా పొందినట్లు వివరించారు. దేశంలో ఓటు హక్కు కూడా వినియోగించుకున్నట్లు వారు చెప్పారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయని చెప్పారు. బంగ్లాదేశ్ వలసదారులకు ఇళ్లు అద్దెకు ఇస్తే భారీ జరిమానా, జైలు శిక్ష పడుతుందన్న ప్రభుత్వ హెచ్చరికలతో.. యజమానులు తమను ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read..
నా కుమారుడికి కీలక మంత్రిత్వ శాఖను కేటాయించండి.. హైకమాండ్‌ను కోరిన సిద్ధరామయ్య
చాలా ప్రత్యేకం.. సీఎం విజయ్‌తో ఎయిర్ హోస్టెస్ ఫొటో వైరల్
ఎల్ఈడీ బల్బును మింగేసిన చిన్నారి.. ఎలా బయటకు తీశారంటే..?
తాజావార్తలు
- ●Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి
- ●Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి
- ●Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా
- ●KTR | పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు
- ●Baanganga Gold & Diamonds | ఇన్వెస్టర్లకు అలర్ట్.. రూ.720 కోట్లకు ప్రముఖ కంపెనీ ఐపీఓ..

Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి

Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా






