త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ వాసుల‌కు ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం.. నాలుగు రోజులు వ‌ర్షాలేన‌న్న ఐఎండీ..!

TG Weather | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎండ‌ల‌తో తీవ్ర ఇబ్బందుల ప‌డుతున్న జ‌నాల‌కు ఊర‌ట క‌లిగించే వార్త చెప్పింది. తెలంగాణ‌లో రాగ‌ల నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

P

Telangana | Published On May 30, 2026, 7.49 pm IST

TG Weather | తెలంగాణ వాసుల‌కు ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం.. నాలుగు రోజులు వ‌ర్షాలేన‌న్న ఐఎండీ..!
Advertisement

TG Weather | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎండ‌ల‌తో తీవ్ర ఇబ్బందుల ప‌డుతున్న జ‌నాల‌కు ఊర‌ట క‌లిగించే వార్త చెప్పింది. తెలంగాణ‌లో రాగ‌ల నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. రాగ‌ల మూడురోజుల్లో ఉష్ణోగ్ర‌త‌లు రెండు నుంచి మూడు డిగ్రీల వ‌ర‌కు తగ్గే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, రాజ‌న్న సిరిసిల్ల‌, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

సోమ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించింది. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, నారాయ‌ణ‌పేట‌, వ‌న‌ప‌ర్తి, జోగులాంబ గ‌ద్వాల్లో వాన‌లు ప‌డుతాయ‌ని చెప్పింది.

బుధ‌వారం రోజున ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, భువ‌న‌గిరి, న‌ల్గొండ‌, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలుల‌తో కూడిన వాన‌లు ప‌డుతాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Advertisement
Advertisement