Maheshkumar Goud | ప్రతి ఓటునూ చూసుకోవాలి.. లేదంటే బెంగాల్ తరహా కుట్రలు జరుగుతాయ్: మహేశ్‌కుమార్‌గౌడ్
Maheshkumar Goud | SIR, BLA-2లపై నిర్వహించే శిక్షణ అత్యంత కీలకమైందని.. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసి ఒక్క ఓటును కూడా పోకుండా చూడాలని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. దాదాపు 90కి పైగా నియోజకవర్గాలలో బీఎల్ఏల ఎంపిక పూర్తి చేసామన్నారు.
- ఇది చాలా కీలకమైన శిక్షణ
- ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
- SIR, BLA-2 శిక్షణ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సూచన
త్రినేత్ర.న్యూస్: SIR, BLA-2లపై నిర్వహించే శిక్షణ అత్యంత కీలకమైందని.. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసి ఒక్క ఓటును కూడా పోకుండా చూడాలని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. గాంధీ భవన్ లో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దాదాపు 90కి పైగా నియోజకవర్గాలలో బీఎల్ఏల ఎంపిక పూర్తి చేసామన్నారు. జిల్లా, మండల కమిటీలు దాదాపు పూర్తి చేశామని చెప్పారు.
ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన వారితో..
సంస్థాగత నిర్మాణంలో దేశంలో తెలంగాణ లో పకడ్బందీగా చేసాం. ఇక్కడ సంఘటన్ సృజన్ అభియాన్ పక్రియ పూర్తి చేశాం. దాదాపు 90కి పైగా నియోజకవర్గాలలో బీఎల్ఏల ఎంపిక పూర్తి చేసాం. జిల్లా కమిటీలు, మండల కమిటీలు దాదాపు పూర్తి చేసాం. టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన నిపుణులైన ట్రైనర్లు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన సౌరబ్, నిశాంత్, అనూష ఇక్కడ మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనీలు నియోజకవర్గ బీఎల్ఏలకు శిక్షణ ఇస్తారు అని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

బీజేపీ కుట్రలతో అక్కడ ప్రభుత్వమే మారిపోయింది..
పశ్చిమ బెంగాల్ లో 93 లక్షల ఓట్లు తీసేసారు. మళ్లీ 30 లక్షల ఓట్లు మాత్రమే ఉంచారు. అక్కడ బీజేపీ చేసిన కుట్రలతో ప్రభుత్వమే మారిపోయింది. ఇక్కడ అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలి. ప్రతి ఓటును తప్పకుండా చూసుకోవాలి. ఇది చాలా కీలకమైన శిక్షణ. దీన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసుకోవాలి. దేశంలో బీజేపీ విషపూరిత కుట్రలు చేస్తూ వస్తోంది అని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, శిక్షణ విభాగం చైర్మన్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి
- ●Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి
- ●Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా
- ●KTR | పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు
- ●Baanganga Gold & Diamonds | ఇన్వెస్టర్లకు అలర్ట్.. రూ.720 కోట్లకు ప్రముఖ కంపెనీ ఐపీఓ..

Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి

Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా





