Sukesh Chandrashekhar | సుఖేష్ చంద్రశేఖర్ జీవితంపై వెబ్‌సిరీస్ – బాలీవుడ్ హీరోయిన్లతో సంబంధాలపై సంచలన నిజాలతో
మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ జీవితం ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. లవ్ స్కామ్ ఔర్ ధోఖా పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్ డిసెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. సుఖేష్ చంద్రశేఖర్‌కు బాలీవుడ్ హీరోయిన్లతో ఉన్న సంబంధాల గురించి సంచలన నిజాలను ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On Nov 26, 2026, 2.33 pm IST
Sukesh Chandrashekhar | మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ జీవితం ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. ఈ డాక్యుమెంటరీ సిరీస్ టైటిల్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. ఈ సిరీస్‌కు లవ్ స్కామ్ ఔర్ దోఖా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డిసెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.
రెండేళ్లు రీసెర్చ్....
ఈ డాక్యుమెంటరీ ఫస్ట్ లుక్‌ను గురువారం విడుదల చేశారు. సుఖేష్ ముఖాన్ని మాత్రమే చూపిస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. ఈ డాక్యుమెంటరీకి మౌమితా సేన్, నియంత శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. జర్నలిస్ట్‌లు మునీష్ పాండే, షామ్స్ తాహిర్ ఖాన్, క్రైమ్ కన్సల్టెంట్స్‌గా పనిచేశారు. దాదాపు రెండేళ్లు రీసెర్చ్ చేసి లవ్ స్కామ్ ఔర్ ధోఖాను తెరకెక్కించినట్లు మేకర్స్ ప్రకటించారు.
బాలీవుడ్ హీరోయిన్లు....
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ అధికారులు వీరిద్దరికి నోటీసులు జారీ చేశారు. ఈ సుఖేష్ చంద్రశేఖర్‌తో ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లకు ఉన్న సంబంధాలపై సంచలన నిజాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా బయటపెట్టబోతున్నట్లు సమాచారం. సుఖేష్ నుంచి వీరిద్దరు తీసుకున్న ఖరీదైన బహుమతులు, అతడితో కలిసి వెళ్లిన ఫారిన్ ట్రిప్‌లు, పార్టీలు, జల్సాల వెనకున్న నిజాలను డాక్యుమెంటరీలో మేకర్స్ ఆవిష్కరించినట్లు తెలిసింది.
తీహార్ జైలులో ఉంటూ...
తీహార్ జైలులో ఖైదీగా ఉంటూ వందల కోట్ల మోసాలకు సుఖేష్ చంద్రశేఖర్ ఎలా పాల్పడ్డాడు? అతడు నేరాల బాట పట్డడానికి కారణమేమిటి? బాలీవుడ్ సెలిబ్రిటీలతో పాటు సంపన్న కుటుంబాలతో పరిచయాల కోసం డబ్బును విచ్చలవిడిగా ఏ విధంగా ఖర్చుచేసేవాడు? సుఖేష్‌పై మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయన్నది ఈ డాక్యుమెంటరీలో ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ చెబుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sharad Pawar | మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
- ●Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి
- ●Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి
- ●Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
- ●FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..
- ●High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష

Sharad Pawar | మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి

Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి

Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు






