త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | దేశ భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డేది లేదు.. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ఏడాది పూర్తైన వేళ ప్ర‌ధాని పోస్ట్‌

PM Modi | దేశ భద్రత విషయంలో భారత్ ఎన్నటికీ రాజీ పడదని ప్ర‌ధాన మంత్ర‌ని న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. శత్రువుల కుతంత్రాలను తిప్పికొట్టడంలో మన సైన్యం సాటిలేని పరాక్రమాన్ని ప్రదర్శించిందని పున‌రుద్ఘాటించారు. ఆప‌రేష‌న్ సిందూర్‌కు నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

D

National | Published On May 7, 2026, 11.07 am IST

PM Modi | దేశ భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డేది లేదు.. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ఏడాది పూర్తైన వేళ ప్ర‌ధాని పోస్ట్‌
Advertisement

PM Modi | ఉగ్రవాదంపై భారత దృఢ నిశ్చయాన్ని, జాతీయ భద్రత పట్ల దేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను 'ఆపరేషన్ సిందూర్‌' (Operation Sindoor) ప్రతిబింబిస్తుందని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) అన్నారు. గ‌తేడాది ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam terror attack) ప్రతిస్పందనగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన ఆప‌రేష‌న్ సిందూర్‌కు నేటితో ఏడాది పూర్తైంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. ఈ సంద‌ర్భంగా భార‌త సాయుధ ద‌ళాల ధైర్య‌సాహ‌సాల‌ను ప్ర‌ధాని ప్ర‌శంసించారు. దేశ భద్రత విషయంలో భారత్ ఎన్నటికీ రాజీ పడదని, శత్రువుల కుతంత్రాలను తిప్పికొట్టడంలో మన సైన్యం సాటిలేని పరాక్రమాన్ని ప్రదర్శించిందని ఆయన పున‌రుద్ఘాటించారు.

“ఏడాది క్రితం మన సాయుధ దళాలు అసాధారణమైన ధైర్యం, అత్యంత ఖచ్చితత్వంతో ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టాయి. పహల్గామ్‌లో అమాయక భారతీయులపై దాడి చేసిన‌ ఉగ్ర‌మూక‌కు తగిన బుద్ధి చెప్పాయి. మన దళాల పరాక్రమానికి యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా మ‌న క‌ఠిన వైఖ‌రిని ఆప‌రేష‌న్ సిందూర్ ప్ర‌తిబింబించింది. దేశ భద్రతను పరిరక్షించుకోవడంలో మన దళాల నిబద్ధత, సంసిద్ధత, సమర్థత, సంకల్ప బలాన్ని ఇది చాటిచెప్పింది. ఇది మన దళాల మధ్య పెరుగుతున్న ఐక్యతకు నిద‌ర్శ‌నం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం భారతదేశం చేస్తున్న కృషి జాతీయ భద్రతకు ఎంతటి బలాన్ని చేకూర్చిందో సిందూర్‌తో స్పష్ట‌మైంది. ఉగ్ర‌వాదులు, వారికి మ‌ద్ద‌తిచ్చే వారిపై ఉక్కుపాదం మోపేందుకు దృఢ నిశ్చ‌యంతో ఉన్నాం” అని ప్రధాని త‌న పోస్టులో రాసుకొచ్చారు.

డీపీగా సిందూర్ కొత్త లోగో..

మ‌రోవైపు ఆప‌రేష‌న్ సిందూర్‌కు ఏడాది పూర్తైన సంద‌ర్భంగా ప్ర‌ధాని త‌న ఎక్స్ ప్రొఫైల్ చిత్రాన్ని కూడా మార్చారు. ఈ ఆప‌రేష‌న్ విజ‌యానికి గుర్తుగా రూపొందించిన కొత్త లోగోను డీపీగా పెట్టుకున్నారు. ఈ కొత్తదాంట్లో గతేడాది ఆపరేషన్‌ సమయంలో విడుదల చేసిన ‘సిందూర్‌’ లోగో పైన సగర్వంగా రెపరెపలాడుతున్న మన మువ్వన్నెల పతాకాన్ని జోడించారు. ఈ కొత్త లోగోను ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా త‌మ ఎక్స్ ఖాతా ప్రొఫైల్స్‌గా పెట్టుకున్నారు.

భార‌త్ దేనినీ క్ష‌మించ‌దు..

మ‌న స‌రిహ‌ద్దు అవ‌త‌ల ఉన్న ఉగ్ర శిబిరాల‌పై అత్యంత ఖ‌చ్చిత‌త్వంతో చేప‌ట్టిన సైనిక చ‌ర్య‌ను భారత వైమానిక దళం గుర్తు చేసుకుంది. ‘భారత్‌ ఏదీ మరిచిపోదు.. దేనినీ క్షమించదు’ అంటూ వీడియో రిలీజ్ చేసింది.

Also Read..

200ఎంపీ టెలిఫొటో కెమెరాతో లాంచ్ అయిన వివో ఎక్స్‌300 అల్ట్రా ఫోన్‌.. ఫొటోగ్ర‌ఫీ ప్రియుల‌కు ప్ర‌త్యేకం..

ఫ్లాట్‌గా ట్రేడ‌వుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల్లో పెరిగిన అప్ర‌మ‌త్త‌త‌..

లెనిన్ వర్సెస్ మా ఇంటి బంగారం - అక్కినేని హీరోకు పోటీగా సమంత మూవీ రిలీజ్!

Advertisement
Advertisement