Samantha | లెనిన్ వర్సెస్ మా ఇంటి బంగారం – అక్కినేని హీరోకు పోటీగా సమంత మూవీ రిలీజ్!
గ్లామర్ క్వీన్ సమంత, అక్కినేని హీరో అఖిల్ సినిమాలు వారం గ్యాప్‌లో థియేటర్లలోకి రాబోతుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అఖిల్ లెనిన్ జూన్ 26న థియేటర్లలోకి రాబోతుండగా...సమంత మా ఇంటి బంగారం జూన్ 19న రిలీజ్ అవుతోంది.
Entertainment | Published On May 7, 2026, 10.09 am IST
Samantha | అనుకున్నదే జరిగింది. సమంత మా ఇంటి బంగారం రిలీజ్ వాయిదాపడనున్నట్లు కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లను నిజం చేస్తూ బుధవారం మేకర్స్ ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. మే 15న రిలీజ్ కావాల్సిన మా ఇంటి బంగారం సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. జూన్ 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఐపీఎల్ ఎఫెక్ట్ కారణంగానే తమ సినిమా రిలీజ్ డేట్‌ను మార్చాల్సివచ్చిందని మేకర్స్ పేర్కొన్నారు.
అఖిల్‌కు పోటీగా....
మా ఇంటి బంగారం కొత్త రిలీజ్ డేట్ టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కినేని హీరోకు పోటీగా సమంత మూవీ థియేటర్లలోకి రాబోతుంది. అఖిల్ అక్కినేని లెనిన్ జూన్ 26న రిలీజ్ కానుంది. లెనిన్, మా ఇంటి బంగారం మధ్య వారమే గ్యాప్ ఉంది.ఇప్పటికే లెనిన్ పలుమార్లు వాయిదాపడింది. ఈ పోస్ట్‌పోన్‌ల కారణంగా సినిమాపై ఉన్న బజ్ కూడా తగ్గింది.
తొలి విజయం...
లెనిన్ సక్సెస్‌పైనే అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంది. హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటినా ఒక్క హిట్టు అందుకోలేకపోయాడు. లెనిన్‌తో తొలి విజయాన్ని అందుకుకోవాలని అఖిల్ ఆశపడుతున్నాడు. మరోవైపు హీరోగా కొడుకును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న నాగార్జున....లెనిన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అన్నపూర్ణ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. పోటీగా పెద్ద సినిమాలేవి లేవని సంబరపడుతున్న లెనిన్ మేకర్స్‌కు సమంత పెద్ద షాకిచ్చింది. మా ఇంటి బంగారం టాక్ ఏ మాత్రం బాగున్నా...ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా లెనిన్‌పై ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
లెనిన్‌కు పోటీగా...
తొలుత మా ఇంటి బంగారం మూవీని కూడా జూన్ 26నే రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ కావాలనే లెనిన్‌కు పోటీగా రిలీజ్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తాయనే మా ఇంటి బంగారం మేకర్స్ వారం రోజులు ముందుకు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.
నందిని రెడ్డి...
మా ఇంటి బంగారం మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, దిగంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మా ఇంటి బంగారం మూవీని భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత నిర్మిస్తోంది.
అఖిల్ లెనిన్ సినిమాకు మురళీకృష్ణ అబ్బూరు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



