vivo X300 Ultra | 200ఎంపీ టెలిఫొటో కెమెరాతో లాంచ్ అయిన వివో ఎక్స్300 అల్ట్రా ఫోన్.. ఫొటోగ్రఫీ ప్రియులకు ప్రత్యేకం..
vivo X300 Ultra | మొబైల్స్ తయారీ సంస్థ వివో తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఎక్స్300 అల్ట్రాని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎక్స్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ వివో ఫోన్ ఇదే కాగా లెన్స్ తయారీ సంస్థ జైస్‌తో భాగస్వామ్యమైన వివో ఈ ఫోన్‌లో అద్భుతమైన కెమెరాలను అందించింది. ఫొటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
Technology | Published On May 7, 2026, 10.57 am IST
vivo X300 Ultra | మొబైల్స్ తయారీ సంస్థ వివో తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఎక్స్300 అల్ట్రాని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎక్స్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ వివో ఫోన్ ఇదే కాగా లెన్స్ తయారీ సంస్థ జైస్‌తో భాగస్వామ్యమైన వివో ఈ ఫోన్‌లో అద్భుతమైన కెమెరాలను అందించింది. ఫొటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఎక్స్300 అల్ట్రా ఫోన్‌లో ఆప్టికల్ ఇంజినీరింగ్, కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ, సిస్టమ్-లెవల్ ఆప్టిమైజేషన్ ఆధారంగా రూపొందించిన ఇమేజింగ్ సిస్టమ్‌ను అందించారు. కంటెంట్ క్రియేటర్లు, ఫోటోగ్రఫీ అభిమానులకు సమగ్ర కెమెరా అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేసినట్లు వివో తెలిపింది. ఇక ఇందులో పలు అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు.
జైస్ ఆప్టిక్స్ సపోర్ట్‌తో..
ఎక్స్300 అల్ట్రాలో 14ఎంఎం, 35ఎంఎం, 85ఎంఎం ఫోకల్ లెంగ్త్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు. ప్రతి లెన్స్‌కు పెద్ద ఫార్మాట్ సెన్సార్, ప్రత్యేక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), జైస్ ఆప్టిక్స్ మద్దతు సపోర్ట్ ఉంది. వివిధ షూటింగ్ పరిస్థితుల్లో స్థిరమైన పనితీరును అందించేందుకు వీటిని రూపొందించారు. 14ఎంఎం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో 50ఎంపీ సోనీ లైటియా 818 సెన్సార్ (1/1.28 ఇంచ్) ఉంది. ఇందులో 1.95 డిగ్రీల ఓఐఎస్, సీపీఏ 6.0 స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉండటంతో తక్కువ వెలుతురు, డైనమిక్ షూటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ లెన్స్ 4కే 120ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. 35ఎంఎం డాక్యుమెంటరీ కెమెరాలో 200ఎంపీ సోనీ లైటియా 901 సెన్సార్ (1/1.12 ఇంచ్) ఉపయోగించారు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ, పోర్ట్రెట్ల కోసం రూపొందించిన ఈ కెమెరాలో సీపీఏ 6.5 స్టెబిలైజేషన్, 12-బిట్ హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉన్నాయి.
200ఎంపీ టెలిఫోటో కెమెరా..
85ఎంఎం ఏపీఓ టెలిఫోటో కెమెరాలో 200ఎంపీ పెద్ద ఫార్మాట్ సెన్సార్ (1/1.4 ఇంచ్) ఉంది. 3 డిగ్రీల గింబల్ తరహా ఓఐఎస్, సీపీఏ 7.0 స్టెబిలైజేషన్‌తో దీన్ని రూపొందించారు. జైస్ ఏపీఓ ప్రమాణాలతో క్రోమాటిక్ అబరేషన్ తగ్గేలా నిర్మించారు. పోర్ట్రెట్లు, యాక్షన్ షాట్స్, లాంగ్ రేంజ్ ఫోటోగ్రఫీకి ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ కెమెరా సిస్టమ్‌లో 60ఎఫ్‌పీఎస్ ఏఎఫ్ ట్రాకింగ్ స్నాప్‌షాట్ మోడ్ కూడా ఉంది. స్పోర్ట్స్ లేదా వైల్డ్‌లైఫ్ వంటి వేగంగా కదిలే సబ్జెక్టులపై రియల్‌టైమ్‌లో ఆటోఫోకస్‌ను నిలుపుకునేందుకు సబ్జెక్ట్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. వివో ఎక్స్300 అల్ట్రా వీడియో సామర్థ్యాలను కూడా మరింత విస్తరించింది. అల్ట్రా వైడ్ నుంచి టెలిఫోటో ఫోకల్ లెంగ్త్‌ల మధ్య సులభంగా మారుతూ ముఖ్యమైన ఫీచర్లను కోల్పోకుండా వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఈ డివైస్ మల్టీ-ఫోకల్ 4కే 120ఎఫ్‌పీఎస్ 10-బిట్ లాగ్ వీడియో, డాల్బీ విజన్, కొత్త ప్రో వీడియో మోడ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో ఎక్స్‌పోజర్, ఫోకస్, టోన్‌లపై మాన్యువల్ కంట్రోల్స్ ఉంటాయి. అదనంగా 4కే 120ఎఫ్‌పీఎస్ స్లో-మోషన్, 4కే టైమ్-ల్యాప్స్ వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు.

భారీ బ్యాటరీ..
వీడియో రికార్డింగ్ కోసం ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్ ప్రీసెట్లతో కూడిన క్వాడ్-మైక్ ఆడియో రికార్డింగ్ సిస్టమ్‌ను అందించారు. కలర్ అక్యురసీ కోసం 5ఎంపీ మల్టీ-స్పెక్ట్రల్ సెన్సార్‌తో 12 కలర్ ఛానెల్స్ కలిగిన కొత్త వివో కలర్ సైన్స్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. జైస్ టీ-కోటింగ్, సూపర్ బ్లూ గ్లాస్‌తో కలిసి ఇది సహజ రంగులను కచ్చితంగా అందించేలా రూపొందించారు. వివో ఎక్స్300 అల్ట్రాలో ఇమేజ్ ప్రాసెసింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైఎండ్ హార్డ్‌వేర్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. దీనికి వివో ప్రోప్రైటరీ ప్రో ఇమేజింగ్ చిప్ వీఎస్1 ప్లస్ సపోర్ట్ ఉంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం పెద్ద లిక్విడ్ కూలింగ్ వేపర్ చాంబర్‌ను ఉపయోగించారు. 6600ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ 100వాట్ వైర్డ్ ఫ్లాష్‌చార్జ్, 40వాట్ వైర్‌లెస్ ఫ్లాష్‌చార్జ్‌కు సపోర్ట్‌ను ఇస్తుంది.
ప్రత్యేక ఎక్స్‌టెండర్లు..
6.82 ఇంచుల 2కే జైస్ మాస్టర్ కలర్ డిస్‌ప్లే, అల్ట్రా ఎక్స్‌డీఆర్ సపోర్ట్, అధిక పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్‌ను కచ్చితమైన వ్యూఫైండర్‌లా ఉపయోగించవచ్చు. ఒరిజిన్ ఓఎస్ 6 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌లో ఒరిజిన్ ఐలాండ్, డ్రాగ్-అండ్-గో ఇంటరాక్షన్స్, మెరుగైన మల్టీటాస్కింగ్ టూల్స్ ఉన్నాయి. డిజైన్ పరంగా ఈ ఫోన్ ప్రొఫెషనల్ కెమెరాలను పోలి ఉంటుంది. స్ప్లిట్-డిజైన్, యూనిబాడీ గ్లాస్-ఫైబర్ నిర్మాణం, సిగ్నేచర్ రెడ్ రింగ్, నర్ల్డ్ టెక్స్చర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఐపీ68, ఐపీ69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌తోపాటు వివో కొన్ని ప్రత్యేక యాక్సెసరీలను కూడా ప్రకటించింది. వివో జైస్ టెలిఫోటో ఎక్స్‌టెండర్లను రెండు విభాగాల్లో ఇస్తున్నారు. 400ఎంఎం ఈక్వివలెంట్ జెన్ 2 అల్ట్రా (4.7ఎక్స్) - లాంగ్ డిస్టెన్స్ షూటింగ్ కోసం తీసుకోవచ్చు. 200ఎంఎం ఈక్వివలెంట్ జెన్ 2 (2.35ఎక్స్) - సాధారణ టెలిఫోటో ఉపయోగాల కోసం తీసుకోవచ్చు. అలాగే వివో ఇమేజింగ్ గ్రిప్ కిట్ ను కూడా లాంచ్ చేసింది. దీంతో కెమెరా తరహా గ్రిప్ లభిస్తుంది. అలగే 2300ఎంఏహెచ్ బ్యాటరీతో షూటింగ్ సమయాన్ని పెంచుతుంది. అయితే ఈ యాక్ససరీలను యూజర్లు విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ యాక్ససరీలను ఇస్తున్నారు.
అద్భుతమైన డిస్‌ప్లే..
వివో ఎక్స్300 అల్ట్రా ఫోన్‌లో 6.82 ఇంచుల 2కే ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉండగా, దీనికి హెచ్‌డీఆర్10 ప్లస్ సపోర్ట్ ఇచ్చారు. అందువల్ల ఓటీటీల్లో అద్భుతమైన క్లారిటీతో వీడియోలను చూడవచ్చు. అలాగే 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నందున గేమర్లు స్మూత్‌గా ఆటలు ఆడుకోవచ్చు. డిస్‌ప్లేకు ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ ను ఇచ్చారు. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 3ఎన్ఎం ప్రాసెసర్ ఉంది, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6 లభిస్తుంది. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. వెనుక వైపు 200ఎంపీ ప్రధాన కెమెరా ఉండగా, మరో 50ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 200ఎంపీ జైస్ ఏపీవో పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు వైపు 50 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, హై-ఫై ఆడియో, 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ సదుపాయాలను ఇచ్చారు.

ధర ఎంతంటే..
వివో ఎక్స్300 అల్ట్రా ఫోన్ కు చెందిన సింగిల్ వేరియెంట్ 16జీబీ, 512జీబీ మోడల్ ధర రూ.1,59,999గా ఉంది. ఎక్స్300 అల్ట్రా ఫోటోగ్రఫీ కిట్ ధర రూ.2,09,999 ఉండగా, 400ఎంఎం జైస్ టెలిఫోటో ఎక్స్‌టెండర్ జెన్ 2 అల్ట్రాను రూ.27,999కు ఇస్తున్నారు. అలాగే 200ఎంఎం జైస్ టెలిఫోటో ఎక్స్‌టెండర్ జెన్ 2 ను రూ.15,999 కి, వివో ఇమేజింగ్ గ్రిప్ కిట్ ను రూ.11,999కి ఇస్తున్నారు. ఈ ఫోన్ వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభ్యం కానుంది. ప్రీ-బుకింగ్స్ గురువారం ప్రారంభమయ్యాయి. మే 14 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
ఆఫర్లు కూడా..
లాంచింగ్ సందర్భంగా బండిల్ కిట్‌పై రూ.4వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత బండిల్ ధర రూ.1,95,997 కి లభిస్తుంది. 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. నెలకు ఈఎంఐ రూ.6,667తో ప్రారంభం అవుతుంది. బండిల్ కిట్‌తో సహా తీసుకుంటే ఫోన్ ఈఎంఐ నెలకు రూ.8,167 అవుతుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 60 శాతం వరకు అష్యూర్డ్ బైబ్యాక్ ను రూ.1599కి ఇస్తున్నారు. 1 సంవత్సరం ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ, వి-షీల్డ్ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్, జియో ద్వారా 18 నెలల పాటు 5000జీబీ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ప్రొ ప్రయోజనాలను ఇస్తున్నారు. అలాగే ఆన్‌లైన్ ఆఫర్లలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై అదనపు 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్‌షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



