Stock Markets | ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో పెరిగిన అప్రమత్తత..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినప్పటికీ మార్కెట్లపై పెట్టుబడిదారులు అంత విశ్వాసాన్ని కనబరచడం లేదని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ఓ వైపు ర్యాలీలను కొనసాగిస్తున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి ప్రభావం కనిపిస్తోంది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినప్పటికీ మార్కెట్లపై పెట్టుబడిదారులు అంత విశ్వాసాన్ని కనబరచడం లేదని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ఓ వైపు ర్యాలీలను కొనసాగిస్తున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి ప్రభావం కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితులకు త్వరలో పరిష్కారం లభించే అవకాశాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభంలో వచ్చిన లాభాలను సూచీలు నిలబెట్టుకోలేకపోయాయి. ఇంట్రాడే కనిష్టానికి చేరుకుని ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 380.72 పాయింట్లు (0.49 శాతం) పెరిగి 78,339.24 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 50 సూచీ 67.55 పాయింట్లు (0.28 శాతం) లాభంతో 24,398.50 వద్ద ఓపెన్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లు బలంగా ఉన్నా..
బ్యాంక్ నిఫ్టీ కూడా 132.95 పాయింట్లు (0.24 శాతం) పెరిగి 56,114.00 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. విస్తృత సూచీల్లో మాత్రం కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్‌లు 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక నిఫ్టీలో ఆటో, మీడియా, మెటల్స్, ఫార్మా, ఐటీ రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరల్లో కొనసాగుతున్న వోలాటిలిటీ, అలాగే కొనసాగుతున్న నాలుగో త్రైమాసిక ఫలితాల సీజన్ కారణంగా మార్కెట్ లాభాలు కొంత పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. జపాన్‌కు చెందిన నిక్కీ225 సూచీ రికార్డు గరిష్ఠ స్థాయిని తాకగా, అమెరికా మార్కెట్లు బలంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ500, నాస్‌డాక్ కంపోజిట్ రెండూ రికార్డు స్థాయి ముగింపులను నమోదు చేశాయి.
తగ్గిన చమురు ధరలు, పతనమైన రూపాయి విలువ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధ పరిస్థితి త్వరగా ముగుస్తుందని అన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రతిపాదించిన ప్రణాళిక ఇంకా సమీక్షలోనే ఉందని తెలిపారు. అదే సమయంలో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల కోసం ఇరాన్ సవరించిన మార్గదర్శకాలను ప్రకటించినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఇంకా పూర్తిగా ముగియకున్నా పెట్టుబడిదారులు ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. కానీ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు సూచీలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.07 శాతం మేర తగ్గి బ్యారెల్‌కు 101.92 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.38 శాతం తగ్గి బ్యారెల్‌కు 92.76 డాలర్ల వద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి మారకం విలువ మరోమారు పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 21 పైసలు తగ్గి డాలర్‌కు 94.82 వద్ద ఉంది. అయితే రూపాయి విలువ పతనమవడం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణకు కారణమవుతుంది. కనుక ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేయదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



