త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Clash between beef vendors | జోగిపేట‌లో బీఫ్ దుకాణాదారుల లొల్లి.. క‌త్తుల‌తో ప‌ర‌స్ప‌ర‌ దాడులు

Clash between beef vendors | సంగారెడ్డి జిల్లా జోగిపేట టౌన్‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. బీఫ్, మటన్ దుకాణాల ఏర్పాటు విష‌యంలో అందోల్‌కు చెందిన కటికే ముస్లింలు, జోగిపేటకు చెందిన ముస్లింల మధ్య శ‌నివారం మ‌రోసారి వివాదం జ‌రిగింది. తీవ్ర వాగ్వాదాల మ‌ధ్య క‌త్తులు, క‌ర్ర‌ల‌తో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు.

S

Telangana | Published On Jul 11, 2026, 3.13 pm IST

Clash between beef vendors | జోగిపేట‌లో బీఫ్ దుకాణాదారుల లొల్లి.. క‌త్తుల‌తో ప‌ర‌స్ప‌ర‌ దాడులు
Advertisement
  • ఆసుప‌త్రికి వెళ్లి బాధితుల‌పై రెండోసారీ దాడి
  • ఇరువ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టిన పోలీసులు

Clash between beef vendors | త్రినేత్ర‌.న్యూస్‌: సంగారెడ్డి జిల్లా జోగిపేట టౌన్‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. బీఫ్, మటన్ దుకాణాల ఏర్పాటు విష‌యంలో అందోల్‌కు చెందిన కటికే ముస్లింలు, జోగిపేటకు చెందిన ముస్లింల మధ్య శ‌నివారం మ‌రోసారి వివాదం జ‌రిగింది. తీవ్ర వాగ్వాదాల మ‌ధ్య క‌త్తులు, క‌ర్ర‌ల‌తో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో జోగిపేట‌కు చెందిన ముస్లిం యువ‌కులు, వ్యాపారుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు వారిని జోగిపేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అయితే ఇంత‌టితో ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. గాయపడిన బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండ‌గా ఆందోల్ కటికే ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఆసుపత్రిలోకి ప్ర‌వేశించారు. బాధితులపై, వారికి అండగా ఉన్నవారిపై మ‌రోసారి దాడులకు తెగబడ్డారు. ఈ క్ర‌మంలో ఆసుపత్రి ప్రాంగణంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దాడుల‌తో అక్క‌డే చికిత్స పొందుతున్న ఇత‌ర‌ రోగులు, సిబ్బంది తీవ్ర‌ భయాందోళనలకు గురయ్యారు.

ఈ వివాదానికి సంబంధించి సమాచారం తెలిసిన వెంట‌నే జోగిపేట పోలీసులు బలగాలతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను పెంచారు. కాగా బీఫ్, మ‌ట‌న్‌ దుకాణాల ఏర్పాటుపై కొద్ది రోజులుగా ఈ విభేదాలు కొనసాగుతున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement