త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NASA | చ‌రిత్ర సృష్టించ‌బోతున్న నాసా.. నేడు చంద్రుడి ఆవ‌లి వైపుగా వ్యోమ‌గాముల‌ ప్ర‌యాణం..!

NASA | అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా చేప‌ట్టిన ఆర్టెమిస్‌-2 మిష‌న్ సోమ‌వారం చ‌రిత్ర సృష్టించ‌బోతున్న‌ది. ఈ మిషన్ ద్వారా మానవులు తొలిసారిగా భూమిపై నుంచి క‌నిపించ‌ని చంద్రుడి మిస్టీరియ‌స్ భాగాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌నున్నారు. 1972 త‌ర్వాత దాదాపు 53 సంవ‌త్స‌రాల త‌ర్వాత వ్యోమ‌గాములు మ‌ళ్లీ చంద్రుడి ఆవ‌లి వైపుగా వెళ్ల‌డం ఇదే తొలిసారి.

P

International | Published On Apr 6, 2026, 10.00 am IST

NASA | చ‌రిత్ర సృష్టించ‌బోతున్న నాసా.. నేడు చంద్రుడి ఆవ‌లి వైపుగా వ్యోమ‌గాముల‌ ప్ర‌యాణం..!
Advertisement

NASA | అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా చేప‌ట్టిన ఆర్టెమిస్‌-2 మిష‌న్ సోమ‌వారం చ‌రిత్ర సృష్టించ‌బోతున్న‌ది. ఈ మిషన్ ద్వారా మానవులు తొలిసారిగా భూమిపై నుంచి క‌నిపించ‌ని చంద్రుడి మిస్టీరియ‌స్ భాగాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌నున్నారు. 1972 త‌ర్వాత దాదాపు 53 సంవ‌త్స‌రాల త‌ర్వాత వ్యోమ‌గాములు మ‌ళ్లీ చంద్రుడి ఆవ‌లి వైపుగా వెళ్ల‌డం ఇదే తొలిసారి. హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని మిషన్ కంట్రోల్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకుల వరకు అందరి దృష్టి ఈ దాదాపు ఆరు గంటల ఫ్లైబైపై కేంద్రీకృతమైంది. ఈ సమయంలో ఇప్పటివరకు రోబోటిక్ మిషన్లు, పరిమిత డేటా ద్వారా మాత్రమే తెలిసిన చంద్రుడి భౌగోళిక నిర్మాణాన్ని శాస్త్ర‌వేత్త‌లు వీక్షించ‌నున్నారు. ప్రస్తుత కక్ష్య స్థితి కారణంగా చంద్రుడి ర‌హ‌స్య భాగంలో కేవ‌లం 20శాతం మాత్ర‌మే సూర్య‌కాంతిలో క‌నిపిస్తుంద‌ని నాసా పేర్కొంది.

ఈ మిషన్‌లో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములు విక్టర్ గ్లోవర్, రీడ్ వైజ్‌మన్, క్రిస్టినా కోచ్‌తో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ పాల్గొంటున్నారు. చంద్రుడి మిస్టీరియ‌స్ భాగాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించిన తొలి అమెరికేత‌ర వ్య‌క్తిగా హాన్సెన్, తొలి మ‌హిళ‌గా క్రిస్టినా, తొలి ఆఫ్రో-అమెరిక‌న్ వ్యోమ‌గామిగా గ్లోబ‌ర్ ఈ ఘ‌న‌త సాధించ‌నున్నారు. దాదాపుగా ప‌దిరోజుల పాటు సాగే ఆర్టెమిస్‌-2 మిష‌న్ పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్‌తో ముగియ‌నుంది. మరోవైపు ఆర్టెమిస్ మిషన్‌లో ఉపయోగిస్తున్న ఓరియ‌న్ క్యాప్సుల్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. మిష‌న్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే టాయిలెట్‌లో లోపం త‌లెత్తింది. అయినా మ‌ధ్య మ‌ధ్య‌లో ప‌ని చేస్తోంది. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ప్రత్యామ్నాయ మూత్ర విస‌ర్జ‌న కోసం బ్యాగ్స్‌ను ఉప‌యోగించాల‌ని మిష‌న్ కంట్రోల్ సూచించింది. అయితే, టాయిలెట్ నుంచి దుర్వాస‌న వ‌స్తోంద‌ని వ్యోమ‌గాములు ఫిర్యాదు చేసిన‌ట్లుగా నాసా అధికారులు వెల్ల‌డించారు.

ఈ ఫ్లైబైలో శాస్త్రవేత్తల ప్రధాన దృష్టి చంద్రుడి దక్షిణార్థగోళంలో ఉన్న ఓరియెంటల్ బేసిన్‌పై ఉండనుంది. సుమారు 930 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఈ భారీ ఓ గుంత ఒక పెద్ద గ్రహశకలం ఢీకొనడంతో ఏర్పడిందని భావిస్తున్నారు. ఈ ప్రభావంతో చంద్రుడి ఉపరితలం విస్తరించి, అనంతరం కుప్పకూలి మూడు వలయాల నిర్మాణం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు మానవ కంటికి కనిపించని మరికొన్ని గుంతలను కూడా పరిశీలించనున్నారు. వీటిలో 64 కిలోమీటర్ల వ్యాసం గల ఓహమ్ క్రేటర్, అలాగే 9 కిలోమీటర్ల విస్తీర్ణం గల పియెరాజో క్రేటర్ కీల‌కం. కెనడా అంతరిక్ష సంస్థ చైర్మ‌న్ లిసా క్యాంప్‌బెల్ మాట్లాడుతూ.. హాన్సెన్ కెనడా త‌ర‌ఫున మిష‌న్‌లో పాల్గొని చ‌రిత్ర సృష్టించార‌న్నారు. మరింత సాధించాలనే ధైర్యం ఉన్నవారే భవిష్యత్తును నిరిస్తార‌న్నారు.

Advertisement
Advertisement