త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ – కోట్లు కుమ్మ‌రించి ఆట‌గాళ్ల‌ను కొన్న మ‌హాన‌టి – అస‌లు క‌థ ఏంటంటే?

కేర‌ళ క్రికెట్ లీగ్ ఆట‌గాళ్ల వేలం పాట శుక్ర‌వారం జ‌రిగింది. ఈ వేలంలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పాల్గొన్న‌ది. కోట్లు వెచ్చించి ప‌లువురు క్రికెట‌ర్ల‌ను కొనుగోలు చేసింది. కీర్తి సురేష్‌కు ఈ వేలానికి ఉన్న లింక్ ఏంటంటే?

N

Entertainment | Published On Jul 11, 2026, 3.35 pm IST

Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ –  కోట్లు కుమ్మ‌రించి ఆట‌గాళ్ల‌ను కొన్న మ‌హాన‌టి – అస‌లు క‌థ ఏంటంటే?
Advertisement

Keerthy Suresh | ఓ వైపు సినిమాలు చేస్తూనే సొంత బిజినెస్‌ల‌లో రాణిస్తున్నారు నేటిత‌రం హీరోయిన్లు. న‌య‌న‌తార స్కిన్ కేర్ మేక‌ప్ బ్రాండ్‌ను ర‌న్ చేస్తోంది. త‌మ‌న్నాకు సొంతంగా జూవెల్ల‌రీ స్టోర్స్ ఉన్నాయి. స‌మంత‌ క్లాతింగ్ కంపెనీని నిర్వ‌హిస్తోంది. వీరే కాకుండా మ‌రికొంద‌రు హీరోయిన్లు సైతం సైడ్ బిజినెస్‌లు చేస్తున్నారు. తాజాగా వీరి బాట‌లో మ‌హాన‌టి కీర్తి సురేష్ అడుగులు వేసింది. క్రికెట్ టీమ్‌కు ఓన‌ర్‌గా మారింది. కేర‌ళ క్రికెట్ లీగ్‌లో త్రివేండం రాయ‌ల్స్ టీమ్‌ను దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌, హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌తో క‌లిసి కీర్తి సురేష్ రెండేళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఇటీవ‌లే ఈ టీమ్ ఓన‌ర్‌షిప్ హ‌క్కుల‌ను పూర్తిగా కీర్తి సురేష్ సొంతం చేసుకుంద‌ని అంటున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్‌, క‌ళ్యాణి వాటాల‌ను కూడా మ‌హాన‌టి తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సీజ‌న్ నుంచే త్రివేండం రాయ‌ల్స్ టీమ్‌కు పూర్తిస్థాయి ఓన‌ర్‌గా కీర్తి సురేష్ వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ఆట‌గాళ్ల వేలం...

శుక్ర‌వారం కేర‌ళ క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఆట‌గాళ్ల వేలాన్ని నిర్వ‌హించారు. త్రివేండం రాయ‌ల్స్ ఓన‌ర్ హోదాలో కీర్తి సురేష్ ఈ వేలానికి హాజ‌రైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. కోట్లు వెచ్చించి ప‌లువురు ఇండియ‌న్, దేశవాళీ క్రికెట‌ర్ల‌ను ఈ ముద్దుగుమ్మ ద‌క్కించుకుంద‌ని అంటున్నారు.

మ‌ల్టీస్టార‌ర్‌లో...

పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్మాల్ గ్యాప్ ఇచ్చిన కీర్తి మ‌ళ్లీ జోరు పెంచుతోంది. ప్ర‌స్తుతం తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రౌడీ జ‌నార్ధ‌న‌తో పాటు వెంక‌టేష్, క‌ళ్యాణ్ రామ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. రౌడీ జాన‌ర్ధ‌న ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో రిలీజ్ కాబోతుండ‌గా... వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ సినిమా సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది.

త‌మిళంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ....

త‌మిళంలో స‌త్య‌వ‌న్ సావిత్రి పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది కీర్తి సురేష్‌. ఇందులో లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. హిందీలో రాఫ్తార్‌తో పాటు మ‌ల‌యాళంలో రెండు సినిమాలు అంగీక‌రించింది. ఆరు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. మ‌రోవైపు కీర్తి సురేష్ న‌టించిన హిందీ వెబ్ సిరీస్ అక్క రిలీజ్‌కు రెడీగా ఉంది.

 

Advertisement
Advertisement