UIDAI Internship | UIDAI ఇంటర్న్‌షిప్ 2026కు దరఖాస్తుల ఆహ్వానం.. బెంగళూరులో ఖాళీలు..
UIDAI Internship | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2026 సంవత్సరానికి గాను ఇంటర్న్‌షిప్ కార్యక్రమం కోసం ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఔత్సాహికులు UIDAI కి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Technology | Published On Apr 6, 2026, 10.41 am IST
UIDAI Internship | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2026 సంవత్సరానికి గాను ఇంటర్న్‌షిప్ కార్యక్రమం కోసం ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఔత్సాహికులు UIDAI కి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 28 పోస్టులు ఉన్నాయని UIDAI తెలియజేసింది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డెవలప్‌మెంట్, యూఐ/యూఎక్స్ డిజైన్ తదితర స్కిల్స్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
చివరి తేదీ ఎప్పుడంటే..
ఈ ఇంటర్న్‌షిప్ కు దరఖాస్తులను సమర్పించేందుకు ఏప్రిల్ 15ను UIDAI చివరి తేదీగా నిర్ణయించింది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ కూడా ఇస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి 6 నెలలు ఉండగా, ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్‌కు బీటెక్, ఎంటెక్, బీఈ, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్, గణితంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, స్టాట్స్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ చేసిన అభ్యర్థులు అర్హులని UIDAI తెలిపింది. అభ్యర్థులు అవసరమైన అర్హతలు, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
అలాంటి వారికి ప్రాధాన్యత..
అధికారిక వెబ్‌సైట్ ద్వారా అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకున్న అనంతరం అభ్యర్థులు సరైన పత్రాలతో దరఖాస్తు చేయవచ్చు. తప్పు సమాచారం అందిస్తే అభ్యర్థుల దరఖాస్తులను UIDAI రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ బెంగళూరులో కనీసం 6 నెలల పాటు కొనసాగుతుంది. పూర్తి కాల వ్యవధి పాటు కొనసాగదలచిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని UIDAI తెలియజేసింది.
అభ్యర్థులు ఇంటర్న్‌షిప్‌కు చెందిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌కు అప్లై చేయాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
- ●Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
- ●Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని
- ●HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
- ●Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!

EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని






