OTT | సెన్సార్ నుంచి 127 కట్స్ – ఓటీటీలో బ్యాన్ – వివాదాస్పద సినిమా సత్లుజ్ కథ ఏంటి?
దల్జీత్ దొసాంజా హీరోగా నటించిన సత్లుజ్ మూవీ పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేయడం వివాదాస్పదమైంది. తీవ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన దహన కాండతో ఆధారంగా సత్లుజ్ మూవీ రూపొందింది.
Entertainment | Published On Jul 6, 2026, 11.22 am IST
OTT | దల్జిత్ దోసాంజా హీరోగా నటించిన సత్లుజ్ మూవీ జూలై 3వ తేదీని ఓటీటీలో రిలీజైంది. రెండు రోజులు కూడా కాకముందే సడెన్‌గా ఈ సినిమా స్ట్రీమింగ్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిలిపివేయడం వివాదాస్పదంగా మారింది. మూడేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ సెన్సార్ అడ్డంకులు, ఆంక్షల కారణంగా థియేటర్లలో రిలీజ్ కాలేదు. పలు మార్పులు చేసి డైరెక్ట్‌గా ఈ సినిమాను మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌ను ఆపేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సినిమాలో ఏముంది? అందుకు సీబీఎఫ్‌సీతో అడ్డంకులు చెప్పింది? ఓటీటీలో స్ట్రీమింగ్ ఆపేయడానికి కారణమేమిటన్నది సినీ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
బయోపిక్...
సోషల్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా దర్శకుడు హనీ టెహ్రాన్ సత్లుజ్ సినిమాను తెరకెక్కించారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ను అడ్డుపెట్టుకొని టెర్రరిస్ట్‌లు అనే ఆరోపణలతో చాలా మంది సామాన్య పౌరులను పంజాబ్ పోలీసులు హత్య చేసినట్లు ఆధారాలతో సహా జస్వంత్ సింగ్ ఖల్రా బయటపెట్టాడు. 2000 మందికిపైగా అక్రమంగా దహనం చేసినట్లు తేలింది. అప్పటి ప్రభుత్వంపై జస్వంత్ సింగ్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత అనూహ్య రీతిలో ఖల్రా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఆరుగురు పంజాబ్ పోలీసులు దోషులుగా తేలారు.
వాస్తవ ఘటనలతో...
ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా జస్వంత్ సింగ్ ఖల్రా జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా పంజాబ్ 95 పేరుతో హానీ టెహ్రన్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో పంజాబ్, తార్న్ తారన్, ఘల్లుఘరా, జస్వంత్ సింగ్ ఖల్రా అనే పదాలు వాడొద్దని అన్నది. దాదాపు 127 కట్స్ చెప్పారు. కథ మొత్తం మారిపోవడంతో మేకర్స్ సీబీఎఫ్‌సీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మూడేళ్లు కోర్టు కేసుల చుట్టూ తిరిగారు. చివరకు సీబీఎఫ్‌సీ సూచనల మేరకు సినిమా టైటిల్‌తో పాటు కొన్ని మార్పులు చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. సత్లుజ్ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
చట్టపరమైన చిక్కులు...
ఈ సినిమాలో పంజాబ్ ప్రభుత్వంతో పాటు పోలీసుల వృత్తిని తప్పుగా చిత్రీకరించారనే ఆరోపణలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణల కారణంగా ఓటీటీలోనూ కూడా సడెన్‌గా ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేశారట. కొన్ని చట్టపరమైన చిక్కుల వల్ల ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేశామని జీ5 ఓటీటీ ప్రకటించింది. సత్లుజ్ మూవీలో అర్జున్ రాంపాల్, సువీందర్ విక్కీ, గీతిక వైద్య ప్రధాన పాత్రల్లో నటించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






