Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్‌డేట్.. ఇక ప్రొఫైల్స్‌కు మరింత స్పష్టంగా లేబుల్స్..
Instagram | ఇన్‌స్టాగ్రామ్ తన ఏఐ క్రియేటర్ లేబుల్‌ను ఏఐ-జనరేటెడ్ ప్రొఫైల్‌గా పేరు మార్చింది. అలాగే ఏఐతో రూపొందించిన వ్యక్తిని ప్రొఫైల్‌లో చూపిస్తూ, సరైన లేబుల్ పెట్టని ఖాతాల రీచ్‌ను పరిమితం చేసే విధానాన్ని కూడా ప్లాట్‌ఫామ్ ప్రవేశపెడుతోంది.
Technology | Published On Sep 2, 2026, 12.48 pm IST
Instagram | ఇన్‌స్టాగ్రామ్ తన ఏఐ క్రియేటర్ లేబుల్‌ను ఏఐ-జనరేటెడ్ ప్రొఫైల్‌గా పేరు మార్చింది. అలాగే ఏఐతో రూపొందించిన వ్యక్తిని ప్రొఫైల్‌లో చూపిస్తూ, సరైన లేబుల్ పెట్టని ఖాతాల రీచ్‌ను పరిమితం చేసే విధానాన్ని కూడా ప్లాట్‌ఫామ్ ప్రవేశపెడుతోంది. ఈ మార్పు ద్వారా నిజమైన వ్యక్తిలా కనిపించే ప్రొఫైల్ వెనుక ఉన్న వ్యక్తిని వాస్తవానికి ఏఐతో క్రియేట్ చేశారా లేదా అనే విషయాన్ని యూజర్లకు స్పష్టంగా తెలియజేయాలని ఇన్‌స్టాగ్రామ్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇన్‌స్టాగ్రామ్ ఏఐ క్రియేటర్ లేబుల్‌ను పరీక్షించింది. తాజాగా దానికి సంబంధించిన పేరును ఏఐ-జనరేటెడ్ ప్రొఫైల్‌గా మార్చింది. ఇప్పటికే ఏఐ క్రియేటర్ లేబుల్ ఉపయోగిస్తున్న క్రియేటర్లకు ఇప్పుడు కొత్త పేరు కనిపిస్తుంది. ఈ లేబుల్ తమ ఖాతాకు ఇంకా వర్తిస్తుందో లేదో వారు పరిశీలించుకోవచ్చు. వర్తిస్తుందని భావిస్తే లేబుల్‌ను కొనసాగించవచ్చు. అవసరం లేదనుకుంటే తొలగించుకోవచ్చు.
క్రియేటివిటీ కోసమే ఏఐ టూల్స్‌ను వాడితే..
తమ సృజనాత్మక ప్రక్రియలో భాగంగా సాధారణంగా ఏఐ టూల్స్‌ను మాత్రమే ఉపయోగించే క్రియేటర్లు ఏఐ-జనరేటెడ్ ప్రొఫైల్ లేబుల్‌ను తప్పనిసరిగా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఖాతా తరచూ నిజమైన మనిషికి బదులుగా ఏఐతో రూపొందించిన వ్యక్తిని చూపించే కంటెంట్‌ను ప్రచురిస్తేనే ఈ లేబుల్ వర్తిస్తుంది. అంటే కేవలం ఫొటో ఎడిటింగ్ లేదా ఇతర సృజనాత్మక పనుల్లో ఏఐని ఉపయోగించడం వల్ల ఈ ప్రొఫైల్ లేబుల్ అవసరం ఉండదు. ఏఐతో రూపొందించిన వ్యక్తిని చూపిస్తున్నప్పటికీ లేబుల్ లేని ప్రొఫైల్ ఉంటే, క్రియేటర్లు తమ ప్రొఫైల్‌ను ఎడిట్ చేసి ఏఐ-జనరేటెడ్ ప్రొఫైల్ ఆప్షన్‌ను ఆన్ చేయవచ్చు. ఈ లేబుల్ మొత్తం ఖాతాకు వర్తిస్తుంది. ఇది ఒక్కో పోస్టుకు వర్తించే ఇన్‌స్టాగ్రామ్ ఏఐ కంటెంట్ లేబుల్‌కు భిన్నంగా ఉంటుంది. ఏఐ టూల్స్‌తో కంటెంట్‌ను రూపొందించినప్పుడు లేదా మార్చినప్పుడు సంబంధిత వ్యక్తిగత పోస్టులపై ఏఐ కంటెంట్ లేబుల్ కనిపిస్తుంది.
ఖాతాల రీచ్ పరిమితం అయ్యే అవకాశం..
ఏఐ-జనరేటెడ్ ప్రొఫైల్ లేబుల్ ఉన్నప్పుడు అది ఖాతా ప్రొఫైల్ పేజీలో లేదా సెర్చ్‌లో ప్రొఫైల్ పేరు పక్కన కనిపిస్తుంది. ఫీడ్, రీల్స్, స్టోరీస్‌లో ఆ ఖాతా ప్రచురించిన కంటెంట్ పక్కన కూడా లేబుల్ కనిపిస్తుంది. అలాగే ఆ ప్రొఫైల్ నుంచి వచ్చే కామెంట్లు లేదా మెసేజ్‌ల పక్కన కూడా ఈ గుర్తింపు కనిపిస్తుంది. సంబంధిత మీడియాకు ఇప్పటికే ఏఐతో రూపొందించిందని లేదా మార్చిందని తెలియజేసే లేబుల్ ఉంటే, ప్రొఫైల్ లేబుల్ ఆ కంటెంట్ పక్కన మళ్లీ కనిపించదు. ఇక రీచ్, రికమండేషన్ల విషయంలోనూ ఇన్‌స్టాగ్రామ్ కీలక మార్పు చేసింది. స్వయంగా ఏఐ-జనరేటెడ్ ప్రొఫైల్ లేబుల్‌ను జోడించే క్రియేటర్ల ఖాతాల రీచ్‌లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. అయితే ఏఐతో రూపొందించిన ప్రొఫైల్‌గా ఇన్‌స్టాగ్రామ్ గుర్తించినప్పటికీ సరైన లేబుల్ పెట్టని ఖాతాల రీచ్‌ను పరిమితం చేసే అవకాశం ఉంటుంది.
అవసరం అయితే అప్పీల్ చేసుకోవచ్చు..
లేబుల్ లేకుండా ఏఐ-జనరేటెడ్ ప్రొఫైల్‌గా గుర్తించిన ఖాతాలకు ఇన్‌స్టాగ్రామ్ నోటిఫికేషన్ పంపుతుంది. తమ ఖాతా రికమండేషన్లలో కనిపించేందుకు అర్హత కోల్పోయిందా లేదా అనే విషయాన్ని క్రియేటర్లు అకౌంట్ స్టేటస్‌లో పరిశీలించుకోవచ్చు. ఖాతా నాన్-రికమండబుల్‌గా మారితే, క్రియేటర్లకు రెండు మార్గాలు ఉంటాయి. మొదటిది, ఖాతా ఏఐ ఆధారిత గుర్తింపును సరిగ్గా ప్రతిబింబించేలా ఏఐ-జనరేటెడ్ ప్రొఫైల్ లేబుల్‌ను జోడించడం. రెండోది, ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్న నిర్ణయం తప్పుగా ఉందని భావిస్తే అప్పీల్ చేయడం. తమ ఏఐ గుర్తింపు వ్యవస్థలు ఎప్పుడూ పూర్తిగా కచ్చితంగా ఉండకపోవచ్చని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. అందువల్ల క్రియేటర్లు అకౌంట్ స్టేటస్ ద్వారా రీచ్‌పై ఏవైనా పరిమితులు విధించారా అనే విషయాన్ని తనిఖీ చేసుకోవచ్చు. పొరపాటుగా పరిమితి విధించారని భావిస్తే నిర్ణయంపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పీల్ విజయవంతమైతే ఆ ఖాతా, దాని కంటెంట్ మళ్లీ ఇన్‌స్టాగ్రామ్ రికమండేషన్లలో కనిపించేందుకు అర్హత పొందుతాయి.
సంబంధిత వార్తలు

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఇక ట్యాగ్ చేసిన పోస్టులూ ప్రొఫైల్‌లోనే..
సెప్టెంబర్ 12, 2026

Obscene Content | టీచర్లు, విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు అసభ్యంగా మార్ఫింగ్.. కాలేజీ స్టూడెంట్ అరెస్ట్
సెప్టెంబర్ 4, 2026

Theenmar Mallanna | జెన్-Z చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.. విద్యకే మా తొలి ప్రాధాన్యం
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్

Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు



