Nepal Flash Floods | నేపాల్ జలవిలయం.. 1000 దాటిన మృతులు.. 4000 మంది మిస్సింగ్
Nepal Flash Floods | నేపాల్‌లో సంభవించిన వరదల్లో (Nepal Flash Floods) మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ జలవిలయంలో మృతుల సంఖ్య నేటికి 1,000 దాటింది.
International | Published On Sep 1, 2026, 11.49 am IST
Nepal Flash Floods | త్రినేత్ర.న్యూస్ : హిమాలయ దేశం నేపాల్‌లో గతవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో (Nepal Flash Floods) మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటింది. వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
అధికారిక సమాచారం ప్రకారం.. నేపాల్‌లో మరణించిన వారి సంఖ్యే 987గా ఉంది. టిబెట్ వైపు 16 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య నేటికి 1,000 దాటింది. మరోవైపు ఈ విపత్తులో 4,000 మందికిపైగా గల్లంతయ్యారు. ఇందులో కేవలం నేపాల్‌లోనే మిస్సైన వారి సంఖ్య 3,916 గా ఉంది. వీరిలో 583 మంది విదేశీయులే. ఇప్పటి వరకూ కనీసం 11,814 మందిని రక్షించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లు, వంతెనలు ధ్వంసమైన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను చేరుకోవడం రెస్క్యూటీమ్స్‌కు కష్టంగా మారింది. దీంతో అత్యవసర సిబ్బంది హెలికాప్టర్లు, ఇతర విమానాలను ఉపయోగిస్తున్నారు.
ఒకే ఇంట్లో 23 మృతదేహాలు
వరదలు సృష్టించిన బీభత్సానికి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని జలసమాధి అయ్యారు. తాజాగా నువాకోట్ జిల్లాలోని ఓ ఇంట్లో ఏకంగా 23 మృతదేహాలు బయటపడటం కలచివేస్తోంది. వరద ప్రభావానికి గురైన ఓ ఇంటిని పరిశీలిస్తున్న సమయంలో మృతదేహాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. అవి ప్రస్తుతం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు చెప్పారు. వాటిని ఖననం చేసేందుకు తరలించినట్లు వెల్లడించారు.
Also Read..
విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు వద్దు.. జీడీపీ వృద్ధిపై దేశ ప్రజలకు ప్రధాని అభినందనలు
కాంగ్రెస్‌ను ఓడించాల్సిందే.. అరెస్టుపై రామచందర్ రావు ఫైర్
నిమ్స్‌లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కౌంటర్స్ ఎత్తేసిన సర్కార్
సంబంధిత వార్తలు

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026

Earthquake | జల ప్రళయం వేళ.. టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం
సెప్టెంబర్ 3, 2026

Sonu Sood | నేపాల్ త్రిశూలి బజార్‌ను సందర్శించిన సోనూ సూద్
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



