Nepal Flash Floods | ఆకస్మిక వరదలకు అదే కారణం.. తేల్చిన నేపాల్ ప్రధాని బలేంద్ర షా
Nepal Flash Floods | నేపాల్ వరదలకు వాతావరణ మార్పులే కారణమని ఆ దేశ ప్రధాని బలేంద్ర షా (Nepal PM Balendra Shah) తేల్చారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్లు వెల్లడించారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి చర్యల ఫలితమేనని తెలిపారు.
International | Published On Sep 2, 2026, 11.39 am IST
Nepal Flash Floods | త్రినేత్ర.న్యూస్ : నేపాల్‌లో గత నెల 26న సంభవించిన ఆకస్మిక వరదలు (Nepal Flash Floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. నేపాల్‌లోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద గ్లేసియర్ విరిగిపడటంతో ఈ డెడ్లీ వరదలు సంభవించాయి. ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమని ఆ దేశ ప్రధాని బలేంద్ర షా (Nepal PM Balendra Shah) తేల్చారు.
హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్లు వెల్లడించారు. ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి చర్యల ఫలితమేనని తెలిపారు. కాబట్టి విపత్తు వల్ల కలిగే సమస్యలను ఎదుర్కోవడం కూడా ప్రపంచ బాధ్యత అని పేర్కొన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల మనం భరించాల్సిన ముప్పు ఏ స్థాయిలో పెరిగిపోతుందో ఈ సంఘటనే ఓ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
1,127 చేరిన మృతులు
ఇదిలా ఉండగా నేపాల్-టిబెట్‌లను అతలాకుతలం చేసిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ (flash floods) కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారం నాటికి 1,127కు చేరుకుంది. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్వాన్ నుంచి 348, తూర్పు నవల్పరాసి నుంచి 217, పశ్చిమ నవల్పరాసి నుంచి 190, నువాకోట్ నుంచి 155, గోర్ఖా 66, ధాడింగ్ నుంచి 59, రసువా నుంచి 45, తనాహు నుంచి 38 మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీశాయి. 1,113 మృతదేహాలకు పోస్టుమార్టం, చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ పూర్తైనట్లు పోలీసులు తెలిపారు. వాటిలో 95 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ 6,541 మందిని భద్రతా దళాలు రక్షించాయి. గల్లంతైన 4,858 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
Also Read..
చార్‌ధామ్ Helicopter యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?
ఆగస్టులో యూపీఐ రికార్డు.. ఒక్క నెలలోనే 24.51 బిలియన్ లావాదేవీలు..
డబ్బుల మూటతో సీఎం రేవంత్.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు
సంబంధిత వార్తలు

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
సెప్టెంబర్ 8, 2026

Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
సెప్టెంబర్ 5, 2026

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
- ●Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
- ●SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు
- ●Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్

Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు

Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్

Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..



