Anna Hazare | మెరుగైన అన్నా హజారే ఆరోగ్యం
Anna Hazare | సామాజిక కార్యకర్త అన్నా హజారే (89) ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌తో ముంబయిలోని బాంబే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు సాధారణ ఆహారం తీసుకుంటున్నారని సన్నిహితులు బుధవారం తెలిపారు.
- మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సామాజిక కార్యకర్త
- మరోరెండు ఆసుపత్రిలోనే
Anna Hazare | సామాజిక కార్యకర్త అన్నా హజారే (89) ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌తో ముంబయిలోని బాంబే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు సాధారణ ఆహారం తీసుకుంటున్నారని సన్నిహితులు బుధవారం తెలిపారు. వైద్యులు మరో రెండు రోజులపాటు ఆసుపత్రిలోనే ఉంచి ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని నిర్ణయించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా అన్నా హజారే ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి మహారాష్ట్రలోని రాలేగణ్ సిద్ధికి తరలించాలని కుటుంబసభ్యులు, సహచరులు భావిస్తున్నారు.
మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌తో ముంబయికి తరలింపు
అన్నా హజారే గతవారం అహిల్యానగర్‌లోని ఆసుపత్రిలో చేరారు. రక్త పరీక్షల్లో మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించడంతో మెరుగైన వైద్యం కోసం సోమవారం రాత్రి ముంబయిలోని బాంబే ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ గౌతమ్ భన్సాలీ తెలిపారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం సాయంత్రం బాంబే ఆసుపత్రికి వెళ్లి అన్నా హజారేను పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు జలవనరుల శాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా ఆసుపత్రికి వెళ్లి అన్నా హజారే ఆరోగ్యంపై ఆరా తీశారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో కీలక పాత్ర
మాజీ సైనికుడైన అన్నా హజారే సామాజిక కార్యకర్తగా సుదీర్ఘకాలంగా ప్రజా ఉద్యమాల్లో చురుకుగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత, అవినీతికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సామాజిక సేవకు గుర్తింపుగా ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించింది.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






