Disha Salians | దిశా సాలియన్ మృతి కేసు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన బాంబే హైకోర్టు
Disha Salians | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salians) మృతి కేసును బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
త్రినేత్ర.న్యూస్ : దివంగత బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salians) మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై బాంబే హైకోర్టు (Bombay High Court) సీబీఐ దర్యాప్తు (CBI Probe)నకు ఆదేశించింది. దిశా సాలియన్ 2020, జూన్ 8న మృతి చెందిన విషయం తెలిసిందే. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్ భవనం 14వ అంతస్తు నుంచి కిందపడి మరణించారు. ఆమె మరణానికి సంబంధించి అనేక అనుమానాలు, ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ సమయంలో పోలీసులు ప్రమాదవశాత్తు మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దిశది ఆత్మహత్యేనని తేల్చారు. అయితే, తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ దిశ తండ్రి సతీష్ సాలియన్ (Satish Salian) బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సారంత్ కొత్వాల్, జస్టిస్ రంజిత్‌సిన్హా రాజా భోన్సెలెలతో కూడిన ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
సీబీఐ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేసింది. దిశ తండ్రి సతీష్ సాలియన్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని తెలిపింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ దర్యాప్తులో కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు లేవని తేలితే.. సీబీఐ సంబంధిత కోర్టులో తగిన సమ్మరీ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. ఆ నివేదికను సవాలు చేసే హక్కు సతీష్ సాలియన్‌కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
Also Read..
ఆకస్మిక వరదలకు అదే కారణం.. తేల్చిన నేపాల్ ప్రధాని బలేంద్ర షా
చార్‌ధామ్ Helicopter యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?
ఆగస్టులో యూపీఐ రికార్డు.. ఒక్క నెలలోనే 24.51 బిలియన్ లావాదేవీలు..
సంబంధిత వార్తలు

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ
ఆగస్టు 7, 2026

Nitin Gadkari | అసహ్యకరమైన కంటెంట్‌ను తొలగించండి.. ఈ20 వివాదంలో నితిన్ గడ్కరీకి ఊరట
ఆగస్టు 5, 2026

Bombay High Court | రెండు పురుగులు కనిపించినంత మాత్రాన లైసెన్స్ రద్దు చేస్తారా..? ఎఫ్‌డీఏ చర్యలను తప్పుబట్టిన బాంబే హైకోర్టు
జులై 30, 2026
తాజావార్తలు
- ●Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు
- ●Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు
- ●Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
- ●DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ
- ●Arpitha Nursing Home | గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే.. మహిళ కిడ్నీ తొలగింపు
- ●Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు

Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు

Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..

DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ



