MLC Ravinder Rao | వీసా రూల్స్ లో తెలంగాణ ఎన్ఆర్ఐలకు సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్ రావు
MLC Ravinder Rao | ఐటీ సాఫ్ట్ వేర్, ఉన్నత చదువుల కోసం అమెరికాలో(America) నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలకు (Telangana NRIs) వీసా నిబంధనల్లో (Visa Rules) సడలింపులివ్వాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao) విజ్ఞప్తి చేశారు.
MLC Ravinder Rao | త్రినేత్ర.న్యూస్: ఐటీ సాఫ్ట్ వేర్, ఉన్నత చదువుల కోసం అమెరికాలో(America) నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలకు (Telangana NRIs) వీసా నిబంధనల్లో (Visa Rules) సడలింపులివ్వాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao) విజ్ఞప్తి చేశారు. వివిధ దేశాల్లో పార్లమెంట్‌ల పనితీరుపై అధ్యయనంలో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ రావు.. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ ప్రతినిధి సుహాస్ సుబ్రమణ్యం, 11వ డిస్ట్రిక్ట్ ప్రతినిధి జేమ్స్ వాకిన్ షాలను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమించిన తీరును, స్వరాష్ట్రం ఏర్పాటైన విషయాలను వారికి వివరించారు. అదేవిధంగా అమెరికాలో పార్లమెంటు నిర్వహణ, ప్రజా సమ్యసలను ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించే తీరును వారిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అమెరికాలో 12 లక్షల మందికి పైగా తెలుగు వాళ్లు నివసిస్తున్నారని, అందులో 6 లక్షల మంది వరకూ తెలంగాణ (Telangana) వాసులు ఉన్నారని చెప్పారు. టూరిస్టు వీసాలతో (Tourist Visa) ఆ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వారికి దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ వారికి అన్నిరకాల వీసాల నిబంధనల్లో మినహాయింపు, వెయ్యి డాలర్ల ఫీజు చెల్లింపును తగ్గించే విషయమై పార్లమెంటులో ప్రస్తావించాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ రవీందర్ రావుతోపాటు సామాజిక విశ్లేషకులు పులి రవి, డాక్టర్ బిక్షం గుజ్జ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధులు కలిశారు.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



