CM Vijay | సీఎం విజయ్ సంచలన ప్రకటన.. వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) సంచలన నిర్ణయం ప్రకటించారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేయనున్నట్లు తెలిపారు.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) కీలక ప్రకటన చేశారు. గత డీఎంకే (DMK) ప్రభుత్వ హయాంలో శాంతియుతంగా నిరసనలు తెలిపిన రైతులు (farmers), ఉపాధ్యాయుల (teachers)పై నమోదైన అన్ని పోలీసు కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇవాళ ఉదయం అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. తమ హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడిన వారిపై గత ప్రభుత్వం అమానుషంగా కేసులు బనాయించిందని విమర్శించారు. సిప్కాట్ (SIPCOT) పారిశ్రామిక అభివృద్ధి, ప్రతిపాదిత పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినందుకు రాష్ట్రానికి వెన్నెముక వంటివారైన రైతులపై అప్పటి డీఎంకే ప్రభుత్వం కేసులు బనాయించినట్లు చెప్పారు.
మే 2021 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో ఆందోళనలు చేపట్టిన రైతులు, ఉపాధ్యాయులపై అనేక కేసులు నమోదైనట్లు చెప్పారు. ఆ కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విజయ్ పేర్కొన్నారు. తమ డిమాండ్ల కోసం పోరాడుతున్న రైతులు, ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ చర్య ప్రజాస్వామ్య హక్కులను మరింత బలోపేతం చేస్తుందని, సామాన్య ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసాన్ని పెంపొందిస్తుందని విజయ్ తెలిపారు.
అదే సమయంలో నీట్ (NEET)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులతో సహా ఇతరులపై నమోదు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సీపీఐ కోరింది. అలాగే, నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC)కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని పీఎంకే (PMK) విజ్ఞప్తి చేసింది. స్పందించిన న్యాయశాఖ మంత్రి నిర్మల్ కుమార్.. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.
Also Read..
దిశా సాలియన్ మృతి కేసు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన బాంబే హైకోర్టు
ఆకస్మిక వరదలకు అదే కారణం.. తేల్చిన నేపాల్ ప్రధాని బలేంద్ర షా
కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో తిరోగమనం వైపు పయనిస్తున్న రాష్ట్రం: హరీశ్ రావు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






