Vande Mataram | స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ఆలాపనను అడ్డుకున్న సోనియా గాంధీ..?
Vande Mataram | స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) రోజున జాతీయ గేయం వందేమాతరం (Vande Mataram)పై దుమారం మొదలైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వందేమాతరాన్ని ఆలపిస్తుండగా.. సోనియా గాంధీ (Sonia Gandhi) అడ్డుకోవడం చర్చకు దారితీస్తోంది.
Vande Mataram | త్రినేత్ర.న్యూస్ : స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) రోజున జాతీయ గేయం వందేమాతరం (Vande Mataram)పై దుమారం మొదలైంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వందేమాతరాన్ని ఆలపిస్తుండగా.. సోనియా గాంధీ (Sonia Gandhi) అడ్డుకోవడం చర్చకు దారితీస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే సహా పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం 'వందేమాతరం' గేయాలాపన జరుగుతుండగా.. దాన్ని మధ్యలోనే నిలిపివేయాలని సోనియా గాంధీ సూచించారు. అయినప్పటికీ ఎవరూ వినకపోవడంతో సోనియా ఆపండి అంటూ చేతులతో సైగలు చేస్తూ కనిపించారు. పక్కనే ఉన్న ఖర్గే, రాహుల్‌తో సోనియా అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడటం వీడియోలో కనిపించింది. ఆ తర్వాత అక్కడే ఉన్న నిర్వాహకుడిని పిలిచి గీతాలాపనను ఆపాలని ఆదేశించినట్లుగా సమాచారం.
ఈ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గేయాన్ని గౌరవించడం లేదంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 'వందేమాతరం'ను మధ్యలోనే అడ్డుకోవడం ద్వారా జాతీయ గేయాన్ని అవమానించారని మండిపడుతున్నారు. నెటిజన్లు సైతం సోనియా తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ ప్రధాని కావాలని కలలు కంటున్న రాహుల్.. ముందు నిజమైన భారతీయుడిగా మారేందుకు ప్రయత్నించాలంటూ చురకలంటిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే..
ఇక ఈ వీడియోపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే, ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ను మీడియా ప్రశ్నించగా.. ఇందులో ఎలాంటి వివాదం లేదని ఆయన బదులిచ్చారు. కాంగ్రెస్ వైఖరిని పార్టీ అధిష్ఠానం లేదా జైరాం రమేశ్ వివరిస్తారని తెలిపారు.
కేరళలోనూ..
కేరళలోనూ వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు జారీ చేసిన మార్గదర్శకాలు రాజకీయ దుమారానికి దారితీశాయి. మార్గదర్శకాల్లో జాతీయ గీతం జనగణమనకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం వందేమాతరాన్ని విస్మరించడం వివాదానికి దారితీసింది.
జాతీయ గేయానికి సముచిత స్థానం
మరోవైపు, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం (Vande Mataram) గేయానికి సముచిత స్థానం లభించింది. దేశ చరిత్రలో ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం పూర్తి గీతాన్ని అధికారికంగా ఆలపించారు. అనంతరం జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. వందేమాతరం 150 ఏండ్ల చరిత్రను పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ ప్రదర్శన చేయడం విశేషం.
Rahul Gandhi aspires to be Indian PM,
Leave being PM, first he should try to be an Indian along with his family members.
Immediately after Vande Mataram started to play
- his mother Sonia Gandhi got angry and openly asked to stop it
- Rahul himself intervened and asked to… pic.twitter.com/SVy97C7Xe1
— Cons of Congress (@ConsOfCongress) August 15, 2026
Also Read..
బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్‌కు ప్లాన్!
బీసీఐ చైర్మన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్స్
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ
సంబంధిత వార్తలు

PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు
ఆగస్టు 15, 2026

Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు
ఆగస్టు 15, 2026

Revanth Reddy | రాష్ట్ర నీటిహక్కుల విషయంలో రాజీపడేది లేదు: సీఎం రేవంత్
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●MLA Anirudh Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
- ●Drinking | సడెన్‌గా మద్యం మానేస్తే.. తర్వాత ఇంకా ఎక్కువగా తాగే ప్రమాదం.. అధ్యయనంలో వెల్లడి..
- ●Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి
- ●KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్
- ●Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్‌కు ప్లాన్!
- ●Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ - పెళ్లికి ముందు యాక్సిడెంట్ - ఆత్మగా ప్రియుడు తిరిగొస్తే!

MLA Anirudh Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Drinking | సడెన్‌గా మద్యం మానేస్తే.. తర్వాత ఇంకా ఎక్కువగా తాగే ప్రమాదం.. అధ్యయనంలో వెల్లడి..

Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి

KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్



