Revanth Reddy | రాష్ట్ర నీటిహక్కుల విషయంలో రాజీపడేది లేదు: సీఎం రేవంత్
Revanth Reddy | రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని గోల్కొండ కోట (Golconda Fort) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని గోల్కొండ కోట (Golconda Fort) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందించనున్నామని వెల్లడించారు. వ్యవసాయంతో పాటు నివాసాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నదన్నారు. ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా మాజీ ప్రధాని నెహ్రూ పేర్కొన్నారని, ఆయన ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టుల ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92 శాతం అధికంగా ఉందని చెప్పారు.
వ్యవసాయాన్ని పండుగలా చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు రైతులకు అందించామని, మొత్తంగా రైతు సంక్షేమం కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం సరికొత్త రికార్డులు అధిగమించిందని వెల్లడించారు. కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని హామీ ఇచ్చారు.
నేడు కొత్త రేషన్ కార్డులు..
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నామని చెప్పారు. మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 15 లక్షలకు పైగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీని శనివారం ప్రారంభించుకుంటున్నామన్నారు. కొత్తగా 2.50 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
పేదల ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది పట్టణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని.. ఇందులో భాగంగా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందిస్తామన్నారు.
సినీ కార్మికులకు సంక్షేమ బోర్డు..
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన పూర్తయ్యిందని వెల్లడించారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్రం కూడా కులగణన చేపట్టిందని గుర్తుచేశారు. తెలంగాణ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేర్చిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా గిగ్ కార్మికుల సంక్షేమం కోసం చట్టం చేశామని, సినీ కార్మికుల సంక్షేమం కోసం కూడా త్వరలో బోర్డు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Independence Day Celebrations at Golconda Fort, Hyderabad https://t.co/KIrYWqjSak
— Telangana CMO (@TelanganaCMO) August 15, 2026
సంబంధిత వార్తలు

Independence Day | ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వరుసగా రెండో ఏడాదీ రాహుల్, ఖర్గే గైర్హాజరు
ఆగస్టు 15, 2026

Independence Day | ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
ఆగస్టు 15, 2026

Police Recruitment | మరో రెండేండ్లు.. యూనిఫామ్ సర్వీసు పోస్టులకు వయోపరిమితి పెంపు..
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●Reliance Industries | అంబానీ కీలక అడుగు.. రోల్స్ రాయిస్‌తో కలిసి ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ..
- ●1947 ఆగస్టు 15న..మన తెలంగాణలో పసుపు జెండా ఎందుకు ఎగిరింది?
- ●Royal Enfield Continental GT 650 | రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కి కొత్త అప్డేట్లు.. ధర ఎంతంటే?
- ●TeamIndia | 600వ టెస్ట్.. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకున్న గిల్
- ●Independence Day | ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వరుసగా రెండో ఏడాదీ రాహుల్, ఖర్గే గైర్హాజరు
- ●Vande Mataram | ఎర్రకోటపై వందేమాతరం.. 150 ఏండ్ల చరిత్రలో తొలిసారి..

Reliance Industries | అంబానీ కీలక అడుగు.. రోల్స్ రాయిస్‌తో కలిసి ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ..

1947 ఆగస్టు 15న..మన తెలంగాణలో పసుపు జెండా ఎందుకు ఎగిరింది?

Royal Enfield Continental GT 650 | రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కి కొత్త అప్డేట్లు.. ధర ఎంతంటే?

TeamIndia | 600వ టెస్ట్.. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకున్న గిల్



