త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్‌కు ప్లాన్!

తాలిబన్లతో చేతులు కలిపి పాక్ ఆర్మీపైకే దాడికి ప్లాన్ చేసిన ఓ సెక్యూరిటీ గార్డును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫోన్‌లో ఏముందో తెలిస్తే షాకే!

J

National | Published On Aug 15, 2026, 3.45 pm IST

Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్‌కు ప్లాన్!
Advertisement
  • బెంగళూరులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డ్ ఆసాఫుల్ మాలిక్ అరెస్ట్
  • నిషేధిత తెహ్రీక్-ఏ-తాలిబన్ (TTP) ఉగ్రవాద సంస్థతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయాలు
  • పాకిస్థాన్ ఆర్మీపై ప్రతీకారం తీర్చుకునేందుకు అఫ్ఘానిస్థాన్ వెళ్లేందుకు యత్నం
  • భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Bengaluru Terror Arrest | త్రినేత్ర.న్యూస్ : బెంగళూరు (Bengaluru) పోలీసులు ఒక భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్ ఆర్మీపై (Pakistan Army) దాడి చేసేందుకు నిషేధిత తెహ్రీక్-ఏ-తాలిబన్ (TTP) ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. ఇతడి మొబైల్ ఫోన్, ట్రావెల్ హిస్టరీపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

అరెస్టయిన వ్యక్తిని ఆసాఫుల్ మాలిక్ బిన్ అబెద్ మాలిక్ (Asaful Malik Bin Abed Malik) గా పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇతడు.. బెంగళూరు శివార్లలోని జిగణి ప్రాంతంలో నివసిస్తూ ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా (Security Guard) పనిచేస్తున్నాడు. పక్కా సమాచారంతో ఆగస్టు 11న బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో పరిచయాలు

పోలీసుల ఇంటరాగేషన్‌లో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్‌లోని మసీదులు, ప్రజలపై అక్కడి ఆర్మీ చేస్తున్న అకృత్యాలపై మాలిక్ తరచూ సోషల్ మీడియాలో (Social Media) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. అంతేకాకుండా, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో పాక్ సైన్యం ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తోందని.. ముస్లింలకు మద్దతు ఇవ్వడం లేదని అతడు నమ్మాడు.

ఈ క్రమంలోనే అఫ్ఘానిస్థాన్‌లో ఉంటున్న TTP ఉగ్రవాది ఇమ్రాన్ అహిందర్ అనే వ్యక్తితో ఫేస్‌బుక్ (Facebook) ద్వారా కాంటాక్ట్ అయ్యాడు. పాక్ ఆర్మీపై ప్రతీకారం తీర్చుకునేందుకు తనకు సాయం చేయాలని కోరాడు.

వీసా కోసం అప్లై చేసి

దాడికి కుట్ర పన్నిన మాలిక్.. అందుకోసం అఫ్ఘానిస్థాన్ వెళ్లేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. దీనికోసం పాస్‌పోర్ట్ (Passport) సంపాదించి.. వీసా (Visa) కోసం కూడా అప్లై చేశాడు. అయితే, పలు కారణాల వల్ల అతని ప్రయాణం కుదరలేదు.

అతని మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు.. పాక్ ఆర్మీపై దాడికి సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లు, మెసేజ్‌లను రికవర్ చేశారు. హెబ్బాగోడి పోలీస్ స్టేషన్‌లో అతనిపై కొత్త క్రిమినల్ చట్టం.. భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 లోని సెక్షన్ 113(3) (ఉగ్రవాద కుట్ర, ప్రోత్సాహం) కింద కేసు నమోదు చేశారు. ఈ ప్లాన్ వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా, TTP తో అతనికి ఉన్న పూర్తి లింకులపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Advertisement
Advertisement