Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ – పెళ్లికి ముందు యాక్సిడెంట్ – ఆత్మగా ప్రియుడు తిరిగొస్తే!
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ చెన్నై లవ్‌స్టోరీ ఓటీటీ రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ ఖరారయ్యాయి. ఆగస్ట్ 21 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ స్ట్రీమింగ్ కాబోతుంది. చెన్నై లవ్‌స్టోరీలో శ్రీ గౌరిప్రియ హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Aug 15, 2026, 3.32 pm IST
Telugu OTT | కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చెన్నై లవ్‌స్టోరీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. చెన్నై లవ్‌స్టోరీలో శ్రీ గౌరిప్రియ హీరోయిన్‌గా నటించింది. బేబీ ఫేమ్ సాయిరాజేష్ కథను అందించిన ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు.
ఐదు భాషల్లో స్ట్రీమింగ్...
థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చెన్నై లవ్‌స్టోరీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. ఆగస్ట్ 21న సోనీలివ్ ఓటీటీలో ఈ రొమాంటిక్ డ్రామా మూవీ రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది.
కెమిస్ట్రీ...
చెన్నై లవ్‌స్టోరీ సక్సెస్‌లో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ యాక్టింగ్, వారిద్దరి కెమిస్ట్రీతో పాటు మణిశర్మ పాటలు కీలకంగా నిలిచాయి. ముఖ్యంగా శ్రీగౌరిప్రియ యాక్టింగ్ అద్భుతమంటూ కామెంట్లు వచ్చాయి. గ్యాప్ తర్వాత తనదైన శైలి మెలోడీ పాటలతో మణిశర్మ మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాడు.
దేవదాసులా మారిన అమ్మాయి...
నివి ప్రేమలో ఫెయిలవుతుంది. విఫల ప్రేమ బాధ నుంచి బయటపడేందుకు మందుకు బానిసగా మారుతుంది. అదే టైమ్‌లో నివికి స్టీవెన్ శంకర్ అనే డైరెక్టర్ పరిచయమవుతాడు. అతడితో పరిచయం కారణంగా నివి మామూలు మనిషి అవుతుంది. కొత్తగా తన లైఫ్‌ను మొదలుపెడుతుంది. స్టీవెన్ శంకర్, నివి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లికి కొద్ది గంటల ముందు స్లీవెన్‌కు యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదం వారిద్దరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది? నివిని ప్రేమ పేరుతో మోసం చేసిన అజయ్ మళ్లీ ఆమె లైఫ్‌లోకి ఎందుకు ఎంటరయ్యాడు? అనే అంశాలతో చెన్నై లవ్‌స్టోరీ మూవీ రూపొందింది.
క, కే ర్యాంప్ తర్వాత చెన్నై లవ్‌స్టోరీతో హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం నాలుగు సినిమాలతో పాటు ఓ వెబ్‌సిరీస్ చేస్తూ హీరోగా బిజీగా ఉన్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | సైలెంట్‌గా ఓటీటీలో వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ – భార్యాభర్తల మధ్యలోకి లేడీ సైకో ఎంటరైతే!
ఆగస్టు 14, 2026

Venkatesh | ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేష్ – రూటు మార్చిన అనిల్ రావిపూడి – మల్టీస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఆగస్టు 14, 2026

Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? – రచయితగా కయదు లోహర్
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి
- ●KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్
- ●Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్‌కు ప్లాన్!
- ●Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
- ●NALSAR student body | బీసీఐ చైర్మన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్స్
- ●Rashmika Mandanna | రష్మిక మందన్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్టర్

Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి

KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్

Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్‌కు ప్లాన్!

Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు



