త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మండే అగ్నిప‌ర్వ‌తం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

MLA Anirudh Reddy | ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Aug 15, 2026, 4.01 pm IST

MLA Anirudh Reddy | కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మండే అగ్నిప‌ర్వ‌తం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Advertisement

MLA Anirudh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వాస్త‌వాలే మాట్లాడార‌ని అనిరుద్ రెడ్డి స‌మ‌ర్థించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వాడు అని పేర్కొన్నారు. ఈ రెండున్నరేళ్లలో మంత్రి పదవి కావాలని ఆయన ఎప్పుడూ అడగలేదు. ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడుతున్నాడు, దాంట్లో తప్పేం లేదు. ప్ర‌భుత్వంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. అవి సరిచేసుకుంటే మా పార్టీకే మంచిది. నేను కూడా గ‌తంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాను. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలనే రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడాడు అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement