Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ
Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కొద్దిసేపు (CJP Instagram account) నిలిచిపోవడం కలకలం సృష్టించింది.
Abhijeet Dipke | త్రినేత్ర.న్యూస్ : స్వాతంత్య్ర దినోత్సవం రోజున కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కొద్దిసేపు (CJP Instagram account) నిలిచిపోవడం కలకలం సృష్టించింది. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో సీజేపీ ఇన్‌స్టా ఖాతా నిలిపివేసినట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఆరోపించారు. కాసేపటికే ఖాతాను తిరిగి విజయవంతంగా పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ ఘటనను ఆయన పిరికిపంద చర్యగా (bloody cowards) అభివర్ణించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ గొంతును అణచివేసే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.
🚨CJP Instagram handle was taken down this morning 🚨
But we have been able to successfully recover the account.
What a shame that those who oppose CJP chose India’s Independence Day to try to muzzle our voice.
We will not be intimidated by such cowardly acts! ✊ https://t.co/Wz3rhExHpu
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) August 15, 2026
సీజేపీ 'స్కూల్ థిక్ కరో' ఉద్యమం ప్రారంభం
మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాక్రోచ్ పార్టీ తన 'స్కూల్ ఠిక్ కరో' (School Thik Karo) ఉద్యమాన్ని ప్రారంభించింది. మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని దిప్కే సొంత గ్రామంలో ఈ కార్య్రమాన్ని సీజేపీ ఇవాళ ఉదయం ప్రారంభించింది. ఈ సందర్బంగా దిప్కే స్వయంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను మెరుగుపరచడం, విద్యావ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడం ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా పాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రజలు, సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలని దిప్కే పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే పాఠశాలలను సందర్శించి అక్కడ సౌకర్యాల గురించి సీజేపీకి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
Broken windows in govt school being covered with the banners of Dy CM of Maharashtra. #SchoolThikKaro pic.twitter.com/XgXIcvbbnC
— Abhijeet Dipke (@abhijeet_dipke) August 15, 2026
Also Read..
కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు
మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్.. హైలక్స్‌కు గట్టి పోటీ..
సంబంధిత వార్తలు

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
ఆగస్టు 13, 2026

Abhijeet Dipke | రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుద్దాం : సీజేపీ పిలుపు
ఆగస్టు 11, 2026

Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్లోకి వస్తలేరు
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం
- ●Google Health Guardian | గూగుల్ నుంచి హెల్త్ గార్డియన్.. ఆరోగ్యంపై 24 గంటల నిఘా..
- ●PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు
- ●Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు
- ●Mahindra Scorpio Lifestyler | మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్.. హైలక్స్‌కు గట్టి పోటీ..
- ●SairaBhanu | హిందూ ... ముస్లిం ప్రేమకథ - ఆది సాయికుమార్ సైరాభాను ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం

Google Health Guardian | గూగుల్ నుంచి హెల్త్ గార్డియన్.. ఆరోగ్యంపై 24 గంటల నిఘా..

PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు

Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు



