త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NALSAR student body | బీసీఐ చైర్మ‌న్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.. న‌ల్సార్ స్టూడెంట్స్

NALSAR student body | బీసీఐ చైర్మ‌న్ మ‌న‌న్ కుమార్ మిశ్రా తీరుపై నల్సార్ లా యూనివర్సిటీ (NALSAR) స్టూడెంట్ బార్ కౌన్సిల్ (NALSAR student body) తీవ్రంగా స్పందించింది. ఈ మేర‌కు బీసీఐ చైర్మ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

D

National | Published On Aug 15, 2026, 3.02 pm IST

NALSAR student body | బీసీఐ చైర్మ‌న్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.. న‌ల్సార్ స్టూడెంట్స్
Advertisement

NALSAR student body | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ లా యూనివర్సిటీ (NALSAR) వివాదం కీల‌క మ‌లుపు తిరిగింది. వ‌ర్సిటీ లా విద్యార్థుల‌కు వ్య‌తిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధిప‌తి మ‌న‌న్ కుమార్ మిశ్రా (Manan Kumar Mishra) తీరుపై న‌ల్సార్ స్టూడెంట్ బార్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. ఈ మేర‌కు బీసీఐ చైర్మ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు, ప్రధానన్యాయమూర్తి (CJI)తో సహా ఏ సంస్థ కూడా చట్టబద్ధమైన విమర్శలకు, పరిశీలనకు అతీతం కాదని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు, అసమ్మతి, నిరసనలు ప్రాథమిక హక్కులని పేర్కొంది. విద్యార్థులు, అధ్యాపకులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకుగాను బీసీఐ చైర్మన్ మన‌న్ కుమార్ మిశ్రా వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని స్టూడెంట్ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది.

ఇదీ వివాదం..

నల్సార్ (NALSAR) లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి (Convocation) భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై పెద్ద వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. వంద‌లాది మంది విద్యార్థులు సీజేఐ రాకను వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాయడం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విద్యార్థుల వైఖ‌రిపై బార్ కౌన్సిల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. న్యాయవ్యవస్థను గౌరవించని వారు లాయర్లు కాలేరంటూ విద్యార్థులందరిపైనా బ్యాన్ విధించింది. విచారణ పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్‌కు చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

బీసీఐ నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. దీంతో వెన‌క్కి త‌గ్గిన బార్ కౌన్సిల్ విద్యార్థులందరి ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన వివాదాస్పద స‌ర్య్కుల‌ర్‌ను కొన్ని గంట‌ల్లోనే వెన‌క్కి తీసుకుంది. ఈ వివాదంపై సీజేఐ సూర్య‌కాంత్ సైతం తీవ్రంగా స్పందించారు. ఇది త‌న‌కు, విద్యార్థుల‌కు సంబంధించిన అంశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంతో బార్ కౌన్సిల్‌కు ఏంటి సంబంధం..? అని ప్ర‌శ్నించారు.

Also Read..

ర‌ష్మిక మంద‌న్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్ట‌ర్

పోస్టాఫీసులోని పీపీఎఫ్, ఎస్సీఎస్‌ఎస్, సుకన్య ఖాతాలను బ్యాంకుకు మార్చుకోవచ్చా? పూర్తి వివరాలు ఇవే..

స్వాతంత్య్ర‌మంటే విముక్తి పొంద‌డమే కాదు.. ప్ర‌తి పౌరుడికి స‌మాన అవ‌కాశాలు అంద‌డం

Advertisement
Advertisement